Bigg Boss 9 Promo :బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో ఇప్పుడు తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. పైగా 9వ సీజన్లో ఐదవ వారం చివరి దశకు కూడా చేరుకుంది.. వీకెండ్స్ అనగానే హోస్ట్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ లో వారం మొత్తంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను సరి చేస్తూ వారికి మళ్ళీ హౌస్ లో ఆ తప్పు రిపీట్ కాకుండా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భరణి శంకర్ (Bharani Shankar) చేసిన పనికి ఏకంగా హౌస్ నుంచే పంపించేయాలి అనే రేంజ్ లో ఆయన కామెంట్ చేశారు. దీనికి తోడు యూకే నుంచి వచ్చిన అమ్మాయి ప్రత్యేకంగా భరణి హౌస్ నుండి వెళ్ళిపోవాలి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వీకెండ్స్ కాస్త హీటెక్కెలా చేసిందని చెప్పవచ్చు.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. బెడ్ టాస్క్ గురించి నాగార్జున ప్రశ్నించారు. భరణి ఎంతో నువ్వు ఎదగాలి.. ముఖ్యంగా బెడ్ పైనుంచి కాదు మా దృష్టిలో నువ్వు ఎదగాలి కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని మేము అస్సలు ఊహించలేదు. తనూజాకి సపోర్ట్ చేసి శ్రీజాను ఒక్కసారిగా కిందకు పడేయడం ఎవరికీ కూడా ఇక్కడ నచ్చలేదు. పైగా నువ్వు స్వార్థం చూపిస్తున్నట్లు అనిపిస్తోంది అంటూ భరణి శంకర్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు నాగార్జున. అంతేకాదు నీ గురించి యూకే నుంచి వచ్చిన అమ్మాయి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటుంది అంటూ ఆ అమ్మాయి చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పించారు.
యూకే నుంచి వచ్చిన అమ్మాయి భరణి శంకర్ తో మాట్లాడుతూ..” మీరు ఆడుతున్న తీరు మాకు నచ్చట్లేదు. అందుకే మిమ్మల్ని హౌస్ లో ఉంచాలనిపించట్లేదు” అంటూ కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికైతే ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ కి వీకెండ్స్ కాస్త హీటెక్కియాని చెప్పవచ్చు. అలా 34వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమో రసవత్తరంగా సాగింది. అంతేకాదు తనుజా కి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు నాగార్జున. మరి వీరంతా వచ్చే వారంలోనైనా గుంపుగా కాకుండా ఒంటరిగా గేమ్స్ ఆడి సత్తా చాటుతారేమో చూడాలి.
also read:Karva chauth: సెలబ్రిటీల ఇంట ఘనంగా కర్వాచౌత్.. మెగా కోడలు మొదలు రకుల్ వరకు!
బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తే.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది.అటు హిందీలో ఏకంగా 18 సీజన్లు పూర్తిచేసుకుని.. 19వ సీజన్ కొనసాగుతూ ఉండగా.. ఇటు కన్నడలో 11 సీజన్లు పూర్తయ్యాయి. 12వ సీజన్ కూడా ఇప్పుడు కొన్ని వివాదాల నుండి బయటపడి మళ్ళీ మొదలైంది. అటు తెలుగులో కూడా తొమ్మిదవ సీజన్ కొనసాగుతోంది. ఇలా ప్రతి భాషలో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ షో. మరి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కి రేపు ఏకంగా 6 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.