Nayanthara: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. రెండు దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా మంచి సక్సెస్ అందుకున్న నయనతార (Nayanthara)ఇప్పుడు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
నయనతార ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఒక్కో సినిమాకు దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. ఈమె నటిగా నిర్మాతగా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆస్తులను రెట్టింపు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నయనతార చెన్నైకి మాత్రమే కాకుండా కేరళ హైదరాబాద్ లో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈమెకు చెన్నైలోని పోయెస్ట్ గార్డెన్ లో ఖరీదైన బంగ్లా ఉంది అయితే తాజాగా ఇదే ప్రాంతంలో మరో లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారని తెలుస్తోంది.
చెన్నైలోని పోయేస్ గార్డెన్ లో నయనతార విగ్నేష్ దంపతులు సుమారు 31.5 కోట్ల విలువ చేసే లగ్జరీ విల్లా కొనుగోలు చేశారు. ఇక నయనతారకు హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. వీటి ఖరీదు సుమారు 15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక కేరళలో కూడా ఖరీదైన ఇల్లు ఉందని తెలుస్తుంది. ఇలా సినిమాలలో నటిస్తూ నయనతార సుమారు 200 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రైవేటు జట్కలిగిన హీరోయిన్ గా కూడా నయనతార గుర్తింపు పొందారు. ఇక తాజాగా చెన్నైలో కొనుగోలు చేసిన ఈ ఇల్లు అన్ని సౌకర్యాలతో అత్యాధునిక హంగులతో రూపొందించిందని తెలుస్తుంది.
శంకర వరప్రసాద్ గారితో హిట్..
ఇక ఈ ఇల్లు 4bhk,16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. నయన్, విగ్నేష్ అభిరుచులకు అనుగుణంగా ఈ విల్లాను డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. ఇక వీరిద్దరి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విగ్నేష్ ప్రదీప్ రంగనాథన్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు ఈ సినిమా నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈమె టాక్సిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు పలు సినిమాలలో నయన్ బిజీగా ఉన్నారు.
Also Read: Anasuya Bhardwaj: ఆంటీ ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన అనసూయ .. ఇచ్చి పడేసిందిగా!