BigTV English

Kannappa Movie : మీ పిల్లలు అనే ఒకే ఒక్క కారణం తప్పా… ఏం చేశారు అసలు ?

Kannappa Movie : మీ పిల్లలు అనే ఒకే ఒక్క కారణం తప్పా… ఏం చేశారు అసలు ?

Kannappa Movie:  మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమాని(Kannappa Movie) ఎంతో విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నేడు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా  మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం మంచు అభిమానుల కంటే కూడా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రుద్ర(Rudra) అనే క్యామియో పాత్రలో నటించారు. ఇక ప్రభాస్ నటించిన నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన హీరోని తెరపై చూడటం కోసం తరలివస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచు విష్ణు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే ఈ సినిమాలో మంచు కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు భాగమైన సంగతి తెలిసిందే మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) మహదేవ శాస్త్రి పాత్రలో నటించారు అదేవిధంగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా చిన్నప్పటి తిన్నడు పాత్రలో నటించారు. అలాగే తన ఇద్దరు కుమార్తెలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇలా ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టినప్పటికీ చిన్న కుమార్తె లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ సలహాతో ఒక సన్నివేశంలో తన చిన్న కుమార్తెను కూడా పెట్టినట్లు ఇటీవల విష్ణు తెలిపారు.

నటనతో మెప్పించలేకపోయారా?


ఈ సినిమాలో మంచు విష్ణు వారసులందరూ కూడా భాగమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభంలోనే తన ఇద్దరు కూతుర్లు కన్నప్ప అనే కథా గానం ద్వారా సందడి చేస్తారు. అయితే ఇక్కడ పిల్లల నటన ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ పాటలో వారు చేసే డాన్స్ కూడా పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పాలి. ఇక విష్ణు కుమారుడు బాల తిన్నడుగా నటించారు. ఆ కుర్రోడు కూడా నటన పరంగా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దీంతో మంచు విష్ణు పిల్లలపై కూడా విమర్శలు వస్తున్నాయి. కేవలం మంచు విష్ణు తన పిల్లలనే కారణంతో ఈ సినిమాలో పెట్టుకున్నారు తప్పా ,వారికి పెద్దగా నటన రాలేదని వీరికి బదులుగా ఎంతోమంది అద్భుతమైన చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు వారిని పెట్టుకుంటే సినిమాకు మరింత కలిసి వచ్చేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మంచు వారి “మనం” సినిమా?

ఇప్పటికే మంచు కుటుంబం అంటేనే ట్రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు తన పిల్లలని ఈ సినిమాలో భాగం చేయడంతో పిల్లలపై కూడా విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇక ఈ సినిమా చూసిన మరి కొంతమంది ఇది కన్నప్ప సినిమా మాదిరిగా లేదని, మంచు వారి మనం సినిమా లాగా ఉంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు చాలా రోజుల తర్వాత కన్నప్ప లాంటి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రతిచోట మంచి స్పందన లభిస్తుంది.

Also Read: హ్యాపీ డేస్ అప్పు గుర్తుందా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

Related News

Coolie : సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్, వాట్ బ్రో అంటున్న విజయ్ ఫ్యాన్స్

Ponnambalam : నేను లక్ష రూపాయల కోసం ఫోన్ చేస్తే చిరంజీవి కోటికి పైగా ఇచ్చారు

Nani On Coolie: రజనీకాంత్ కంటే నాగార్జున కోసమే ఎదురుచూస్తున్న – నాని

Krish Jagarlamudi: చైనా లాగా ఇక్కడ సాధ్యమవుతుందా? ఉన్న థియేటర్లకే దిక్కులేదు 

Anupama Parameswaran: ప్లీజ్‌ నా సినిమా చూడండి.. ప్రెస్‌మీట్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ అనుపమ

Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది 

Big Stories

×