Leopard Viral Video| జనావాసంలోకి ఒక భయంకర కృూర మృగం దూసుకువచ్చింది. దాన్ని చూసి అందరూ దూరంగా పారిపోయారు. కానీ ఒక యువకుడు మాత్రం తెగువ చూపించాడు. ధైర్యంతో అతనొక్కడే ఏ ఆయుధం లేకుండా దాన్ని అదుపులోకి తీసుకోవాలని పోరాటం చేశాడు. అతడికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయినా భయపడకుండా దానిపై పట్టు సాధించాడు. ఈ దృశ్యాలన్నీ ఒకరు వీడియో తీయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని జుగున్పూర్ గ్రామంలో జూన్ 23న ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఆ గ్రామంలో నివసించే 35 ఏళ్ల యువకుడైన మిహిలాల్ కూలీ పని జీవనం సాగిస్తున్నాడు. అయితే గ్రామంలోకి ఒక భయంకరమైన చిరుతపులి ప్రవేశించింది. అది మనుషులపై దాడుల చేయడానికి ప్రయత్నించగా.. అది చూసిన జనం అరుపులు కేకలు వేయడంతో అది పారిపోయి ఒక ఇటుకల బట్టిలో దాక్కుంది. దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించగా.. అది జనం మీదకు దాడి చేయబోయింది. అది చూసి చుట్టూ ఉన్న జనం అంతా పరుగులు తీశారు. కానీ మిహిలాల్ మాత్రం ధైర్యంగా దాని వైపు అడుగులు వేశాడు. దీంతో చిరుత అతనిపై దాడి చేసింది. మిహిలాల్ కూడా చిరుతపులిని గట్టిగా ఎదుర్కొన్నాడు. దాన్ని తన రెండు చేతులతోనే ఎదుర్కొని పోరాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
అటవీ శాఖ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన ఒక ఇటుక బట్టీ వద్ద జరిగింది. చిరుతపులి బట్టీలోని చిమ్నీలో దాక్కుని ఉంది. మిహిలాల్ తన సహచరులతో కలిసి పని చేస్తున్నప్పుడు, చిమ్నీ వైపు వెళ్లగా చిరుత అతనిపై దాడి చేసింది. అయితే, మిహిలాల్ భయపడకుండా చిరుతతో ధైర్యంగా పోరాడాడు. సమీపంలో ఉన్న ఇతర కూలీలు వెంటనే అక్కడికి చేరుకొని, చిరుతపై రాళ్లు, ఇటుకలు విసిరారు. దీంతో చిరుత సమీపంలోని అరటి తోటలోకి పారిపోయింది.
చిరుత మళ్లీ దాడి, అటవీ అధికారులకు గాయాలు
ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు వెంటనే చేరుకున్నారు. అరటి తోటలో గాయపడిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అది మళ్లీ దాడి చేసింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ దీక్షిత్.. రేంజర్ న్రిపేంద్ర చతుర్వేది, పోలీసు అధికారి రామ్ సజీవన్, స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్ ఖాన్ గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మిహిలాల్, ఇక్బాల్, రాజేష్‌లను లఖింపూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. న్రిపేంద్ర, రామ్ సజీవన్‌లకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.
అదే రోజు సాయంత్రం.. అటవీ శాఖ బృందాలు అదనపు పోలీసు సహాయంతో మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ ఉమ్మడి ఆపరేషన్‌లో చిరుతను విజయవంతంగా పట్టుకున్నారు. ఆ తర్వాత చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, అటవీ శాఖ అదుపులోకి తీసుకున్నారు.
Also Read: 50 సంవత్సరాలుగా కడుపులో టూత్ బ్రష్.. ఏ సమస్య లేదు కానీ
మిహిలాల్.. అసాధారణ ధైర్యం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది. ఒక సామాన్య కూలీ, ప్రమాదకరమైన చిరుతతో ఎలా పోరాడాడో చూపించే ఈ వీడియో మాజీ ముఖ్యమంత్రి అభిలేష్ యాదవ్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన గ్రామీణ ప్రాంతాల్లో మానవ-వన్యప్రాణి సంఘర్షణలను ఎదుర్కొనే సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసుల సమన్వయంతో చిరుతను సురక్షితంగా పట్టుకోవడం ఈ సంఘటన సుఖాంతం కావడానికి దోహదపడింది.
धौरहरा के ग्राम बबुरी स्थित ईंटें के भट्ठे पर एक तेंदुए से मुकाबला करते जो मजदूर घायल हुआ है उसके अच्छे से अच्छे इलाज-उपचार की व्यवस्था की जाए।
भाजपा राज में वनों को लूटने के लिए लगातार बढ़ता हुआ, जो बेतहाशा अतिक्रमण किया जा रहा है, उसकी वजह से ही जंगली जानवर बस्तियों में आने… pic.twitter.com/FeRU61h2E2
— Akhilesh Yadav (@yadavakhilesh) June 24, 2025