BigTV English

Kishkindhapuri Collection : ‘కిష్కిందపురి’ కలెక్షన్స్.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..?

Kishkindhapuri Collection : ‘కిష్కిందపురి’ కలెక్షన్స్.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..?

Kishkindhapuri Collection : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది భైరవం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. కానీ పర్వాలేదు. ఆ తర్వాత ఈయన నటించిన సోలో మూవీ కిష్కిందపురి.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన చిత్రం పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ హారర్ర్ థ్రిల్లర్ ను నిర్మించారు.. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పాలి. అయితే మూడో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


‘కిష్కిందపురి’ కలెక్షన్స్…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ట్రైలర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న చిత్రం థియేటర్ లోకి వచ్చిన తర్వాత యావరేజ్ టాక్ ని అందుకుంది. దాంతో కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చేసాయి. కిష్కంధపురి ఫస్ట్ డే 4 కోట్ల గ్రాస్. 2.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇందులో ప్రొడ్యూసర్ వాట 40 శాతం. అంటే నిర్మాత చేతికి కోటి 60 లక్షలు మాత్రమే వచ్చాయి.. రెండో రోజు కూడా డల్ గానే వసూళ్లను అందుకుంది. మూడో రోజు మాత్రం కాస్త మెరుగ్గా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా 9.4 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. చూద్దాం ఎన్ని కోట్లు వసూళ్లను అందుకుంటుందో.. ఏది ఏమైనా ఈయనకు ఒక్క హిట్ పడితేనే మళ్లీ ట్రాక్ లోకి వస్తాడు..

Also Read : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘మిరాయ్’.. హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?


ఎన్ని కోట్లు రాబడితే టార్గెట్ రీచ్ అవుతుంది..? 

బెల్లం బాబు సోలోగా ప్రస్తుతం ఆయన నటించిన కిష్కిందపురి మూవీ అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని చిత్రానికి రూ.12 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.. ఈ సినిమా మొత్తంగా కలిపి 25 కోట్లు వసూలు చేస్తే హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే అన్ని కోట్లు వసూలు చేయడం కష్టమని అనిపిస్తుంది. మరి ఈ వీకెండ్ అయిన కలెక్షన్స్ పెరుగుతాయని అనుకున్నారు. కానీ కష్టమే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.. బెల్లం సాయి శ్రీనివాస్ తెలుగు లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశాడు. అయితే అక్కడ కూడా ఇతనికి నిరాశ మిగిలింది. దాంతో మళ్లీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వరుసగా సినిమా లను లైన్లో పెట్టుకుంటున్నాడు.. ఈసారైనా కరెక్ట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడేమో చూద్దాం..

Related News

Malaika Arora: ఇల్లు అమ్మి కారు కొన్న హాట్ బ్యూటీ..

Kotha Lokah: ఊచకోత కోస్తున్న కొత్తలోక.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Meena: సౌందర్యతో పాటూ నేను కూడా చచ్చిపోయేదాన్ని… మీనా సంచలన కామెంట్!

Manchu Manoj: మిరాయ్ హిట్ అయినా హ్యాపీగా లేని మనోజ్.. కారణం అదేనా

Nidhhi Agerwal: నిధిని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. డార్లింగే ఆదుకోవాలి

Mirai: AI కాదు.. రాముడి పాత్రలో నటించింది ఈయనే.. టీమ్ క్లారిటీ!

Naga Vamsi: మరో జాక్ పాట్ కొట్టిన నాగ వంశీ.. సూర్య సినిమాకు భారీ ఓటీటీ డీల్

Big Stories

×