 
					Amulya Gowda : బుల్లితెర ప్రేక్షకులకు అమూల్య గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆ సీరియల్ మంచి సక్సెస్ టాక్ ని అందుకోవడంతో ఆ తర్వాత గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది.. ఈ సీరియల్లో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో మీనా పాత్రలో కన్నడ నటి అమూల్య గౌడ నటించిన. ఎంతో న్యాచురల్ గా తెలుగు అమ్మాయిల గా తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.. ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
కన్నడ ఇండస్ట్రీలోని ముద్దుగుమ్మలు తెలుగులోని స్టార్ సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. వీరి నటనకి తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈమధ్య తెలుగు చానల్స్లలో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులే ఉండడం విశేషం.. అలా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కన్నడ నటి అమూల్య గౌడ. కార్తీకదీపం సీరియల్ లో సౌర్యపాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమూల్య.. ఓ సినిమా ఆడిషన్ కోసం వెళితే దాని ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయట పెట్టింది. అక్కడ ఆడిషన్ చేసిన వ్యక్తి అసభ్యంగా మెసేజ్లు పంపేవాడని, అతనిపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసుకోకు అని బెదిరించడంతో అక్కడి నుంచి మాట మాట్లాడకుండా వచ్చేసినట్లు చెప్పింది.. ఆ పరిస్థితి తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని ఆమె అన్నారు. ఇక ఆ తర్వాత ఆడిషన్ కి వెళ్ళాలంటే భయపడేదాన్ని ఆమె అన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
Also Read : బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరున్నారు..? ఈ వారం ఎలిమినేట్ అతనే..?
అమూల్యా గౌడ మైసూర్ కు చెందిన ముద్దుగుమ్మ.. ఆమె బాల్యం, చదువు అన్ని అక్కడే పూర్తి చేసుకుంది. స్వాతి ముత్తు, పునార్ వివాహ, అరమనే వంటి వాటిల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్లలో నటించింది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈమె తన లేటెస్ట్ ఫోటోలతో యూత్ని బాగా ఆకట్టుకునేది.. కన్నడ బిగ్ బాస్ లో పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది. తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. రౌడీ అమ్మాయిగా కనిపించి జనాలని ఆకట్టుకోవడంతో ఆ తర్వాత వరుసగా సీరియల్ అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తుంది. కన్నడలో పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.