BigTV English
Advertisement

Nidhhi Agerwal: హరి హర వీరమల్లు సెట్ లో చిలుకతో ఆటలు.. చేయి కోరకడంతో విలవిల్లాడిన నిధి..

Nidhhi Agerwal: హరి హర వీరమల్లు సెట్ లో చిలుకతో ఆటలు.. చేయి కోరకడంతో విలవిల్లాడిన నిధి..


Nidhhi Agerwal Playing with Parrot: మొన్నటి వరకు హీరోయిన్ నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు మూవీతో ఫుల్ బిజీగా ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ బాగున్న.. కథనం అంత మెప్పించలేకపోయిందని, సీజీ వర్క్ దారుణంగా నిరాశపరిచిందనే ఆడియన్స్ నుంచి రివ్యూస్ వస్తున్నాయి. అయితే ముందు నుంచి హరి హర వీరమల్లు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. హీరో లేనప్పటికీ నిర్మాతతో కలిసి వరుస ఇంటర్య్వూలు ఇచ్చింది. మొదటి నుంచి సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉంది.

చిలుకతో నిధి పాప ఆటలు


ఈ సందర్భంగా హరి హర వీరమల్లు షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. తాజాగా షూటింగ్ సెట్ నుంచి ఓ వీడియో వదిలింది. ఇందులో నిధి పాప చిలుకతో ఆడుతూ కనిపించింది. ఆ చిలుక నిధి చేయి కొరకడంతో ఆమె నొప్పితో విలవిల్లాడింది. ఈ వీడియోను నిధి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే నిధి ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకుంటోంది. మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా జరుపుకోనుంది.

గ్రాండ్ రీఎంట్రీ

రీఎంట్రీతో బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ని భారీగా ప్లాన్ చేసింది నిధి. నాగ చైతన్య సవ్య సాచితో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వరుస ప్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో కమర్షియల్ హిట్ అందుకుంది. కానీ, ఈ మూవీ విజయం ఆమెకు కెరీర్ ప్లస్ కాలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించినా.. నిధికి మాత్రం అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో ఆమె.. తమిళ్ ఇండస్ట్రీకి మకాం మార్చింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, అవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో అక్కడ కూడా నిధికి నిరాశే ఎదురైంది. కాస్తా గ్యాప్ తీసుకున్న నిధి.. హరి హరి వీరమల్లుతో తెలుగులో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది.

కేమిస్ట్రీ మిస్

ఈ సినిమా కూడా ఆమె పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. వీరమల్లులో ఆమె లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా.. పవన్, నిధి మధ్య కెమిస్ట్రీ మిస్ అయ్యిందంటున్నారు. ఆమె పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. మరి ది రాజా సాబ్ తో అయినా నిధికి ఆశించిన విజయం దక్కుతుందా? లేదా చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే మంచి వసూళ్లు సాధించింది. తొలి రోజు హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు కొట్టింది. మూవీకి కాస్తా నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్ల భారీ డ్రాప్ కనిపించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 73 కోట్ల నెట్, రూ. 108 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది.

Related News

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Big Stories

×