BigTV English

TCS CEO Salary: TCSలో ఉద్యోగాల కోత.. CEOకు మాత్రం అన్ని కోట్ల జీతమా? తగ్గించుకోవచ్చుగా?

TCS CEO Salary: TCSలో ఉద్యోగాల కోత.. CEOకు మాత్రం అన్ని కోట్ల జీతమా? తగ్గించుకోవచ్చుగా?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – TCS లో ఇటీవల 2 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ భారీ లేఆఫ్ తో దాదాపు 12వేలమందికి పైగా రోడ్డునపడే అవకాశముంది. అసలు TCS అంటే దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగం అన్నంత ధీమా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఉండేది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి TCS లో కూడా కోతలు తప్పలేదు. అయితే దాదాపు 12వేల ఉద్యోగులను ఒకేసారి బయటకు పంపేస్తారని మాత్రం ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఈ ఉద్వాసన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే సమయంలో TCS కంపెనీ సీఈఓ జీతం కూడా చర్చనీయాంశంగా మారుతోంది.


సీఈఓ జీతం ఎంత?
TCS కంపెనీ సీఈఓ కె. కృతివాసన్ వార్షిక వేతనం రూ.26.52 కోట్లు. ఇందులో రూ.1.39 కోట్లు బేసిక్ పే. రూ. 2.13 కోట్లు ఇతర ప్రయోజనాల లెక్కల్లో ఉంటాయి. రూ.23 కోట్లు ఆయన కమిషన్ రూపంలో తీసుకుంటారు. 12వేల మంది ఉద్యోగుల్ని తీసేస్తున్న క్రమంలో సీఈఓకి మాత్రం అంత పెద్ద మొత్తంలో జీతం ఇవ్వడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉద్యోగుల్ని తొలగించకుండా సీఈఓ లాంటి పెద్దస్థాయి ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తం తగ్గించుకోవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. సీఈఓ సహా ఇతర పెద్ద స్థాయి ఉద్యోగుల జీతంలో కోత పెడితే ఆ 12వేలమంది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి రాదనేది నెటిజన్ల సలహా.

నెటిజన్ల సలహాలు..
రూ. 26.52 కోట్లు జీతం తీసుకునేవారి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని, అదే సమయంలో వార్షిక వేతనం రూ.15 లక్షలు అంతకంటే తక్కువగా ఉండే సాధారణ ఐటీ ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా ఉంటాయని, ఇప్పుడు ఉద్యోగాలు పోతే వారంతా ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగులను ఇంటికి పంపడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఇక టీసీఎస్ ఇప్పటికీ లాభాల్లోనే ఉందని, అదే సమయంలో ఉద్యోగుల్ని తొలగించడం సమర్థనీయమైన చర్య కాదని మరొకరు స్పందించారు. టీసీఎస్ లాభాల్లో 6 శాతం పెరుగుదల ఉందని, ఇప్పటికైనా ఆ కంపెనీ మానవతా కోణంలో ఆలోచించాలని, తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.


మీకు విషయం తెలుసా..?
మరికొందరు మాత్రం టీసీఎస్ కంపెనీ చర్యల్ని సమర్థిస్తున్నారు. ఉద్యోగుల్ని తొలగించేది కేవలం ఆర్థిక మిగులు కోసం కాదని వారు అంటున్నారు. సీఈఓ ఉద్యోగం ఉంది కాబట్టి అతడు జీతం తీసుకుంటున్నాడని, సీఈఓని కూడా తొలగిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది డబ్బులు ఆదా చేసుకోడానికి చేసిన ప్రయత్నం కాదని అంటున్నారు. టీసీఎస్ ఒక ప్రైవేట్ కంపెనీ అని, ఛారిటీ సంస్థ కాదని, ఉద్యోగుల్ని ఉదారంగా భరించడం ఆ సంస్థ విధి కాదని చెబుతున్నారు. ఇంకొంతమంది మరో విచిత్రమైన సలహా ఇచ్చారు. భారత దేశంలో ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే ప్రతి ఒక్కరు అదనంగా 10శాతం ప్రభుత్వానికి జమ చేస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మీరు, మీ కుటుంబం తరపున 5వేల రూపాయలు విరాళంగా ఇస్తే.. వారి జీవితాలు మెరుగవుతాయంటూ సెటైరిక్ పోస్ట్ పెట్టారు.

Related News

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Jio Offers: ఎగిరి గంతేసే వార్త.. జియో తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

PAN 2.0: పాన్ 2.0.. అప్‌డేట్ వెర్షన్, అయితే ఏంటి?

Big Stories

×