BigTV English

Thammudu Movie: ఫస్ట్ టైమ్ పార్ట్నర్ ను మార్చిన దిల్ రాజు, ఇక తమ్ముడు సేఫ్ జోన్ లోనే

Thammudu Movie: ఫస్ట్ టైమ్ పార్ట్నర్ ను మార్చిన దిల్ రాజు, ఇక తమ్ముడు సేఫ్ జోన్ లోనే

Thammudu Movie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకరు. జయం సినిమాతో హీరోగా కెరియర్ మొదలు పెట్టిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసిన దిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న వెంకటరమణ రెడ్డి దిల్ రాజుగా మారిపోయారు. ఈ సినిమాకి సుకుమార్ రచయితగా పనిచేశారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యద్భుతమైన సక్సెస్ సాధించింది. వరుసగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో హిట్ సినిమాలు వచ్చాయి. ఎంతో మంది కొత్త దర్శకులు ఈ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అంతా ఈ బ్యానర్ నుంచి వచ్చిన వాళ్లే.


రీసెంట్ టైమ్స్ లో జోరు తగ్గింది 

ఒకప్పుడు దిల్ రాజ్ ప్రొడక్షన్ లో కనీసం మూడు నాలుగు సినిమాలు నిర్మితమవుతూ ఉండేవి. ప్రస్తుతం మాత్రం దిల్ రాజు బ్యానర్ కొంచెం వెనక్కి తగ్గింది అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. దర్శకుడు శంకర్ తెలుగులో చేసిన మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఇదే ఏడాది సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. గేమ్ చేంజెర్ సినిమా నష్టాలను ఈ సినిమా కొంత మేరకు పూడ్చివేసింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో వస్తున్న సినిమా తమ్ముడు.


ఓటిటి పార్ట్నర్ ను మార్చేశారు

మామూలుగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో వ‌చ్చిన సినిమాల ఓటీటీ హ‌క్కులన్నీ అమేజాన్‌కే అమ్ముతారు. అయితే మొదటిసారి ‘త‌మ్ముడు’ని నెట్ ఫ్లిక్స్ చేతిలో పెట్టారు. శాటిలైట్ స్టార్ మా సొంతం చేసుకొంది. ఓటీటీ, హిందీ డ‌బ్బింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్… ఇలా నాన్ థియేట్రిక‌ల్ మొత్తం క‌లిపి రూ.38 కోట్లు వచ్చినట్లు సమాచారం.ఈ సినిమాకు బ‌డ్జెట్ అటూ ఇటుగా రూ.75 కోట్ల‌య్యింది. నితిన్ కు అంత మార్కెట్ లేదు కదా దిల్ రాజు ఎందుకు రిస్క్ చేశారు అని చాలామంది మాట్లాడుకున్నారు. అయితే ఇప్పటికీ 38 కోట్లు వచ్చేసింది కాబట్టి, టాక్ బాగుంటే మిగిలిన మొత్తం రాబ‌ట్టుకోవ‌డం అంత క‌ష్ట‌మేం కాదు. మొత్తానికి ‘త‌మ్ముడు’ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్న‌ట్టే అర్థమవుతుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సినిమా జులై 4న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాతో నితిన్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి. నితిన్ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది.

Also Read : Kannappa Ticket Rates : నా కక్కుర్తి కోసం టికెట్ రేట్లు ను పెంచను

Related News

Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1కి ఆ శాపం.. అవరోధాలున్నాయని దేవుడు చెప్పాడు.. ప్రొడ్యూసర్‌ షాకింగ్‌ కామెంట్స్

66 Years Of Kamal Haasan: కమల్ హాసన్ వివాదాలకు కేంద్ర బిందువు

Tollywood: తుది దశకు చేరుకున్న సినీ కార్మికుల సమ్మె… రేపు ఫైనల్ మీటింగ్ ?

Vijay Sethupathi: డబ్బుతో అమ్మాయిలను వంచిస్తాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

Upasana: ఉప్సీ ఫోన్‌లో చరణ్ పేరు ఏం ఉంటుందో తెలుసా ? ఆ 200 వెనక పెద్ద కథే ఉంది

Anupama Parameswaran: 7:00 కి రమ్మంటారు… 9:30 కి షాట్ తీస్తారు, అడిగితే ఆటిట్యూడ్ అంటారు

Big Stories

×