BigTV English

Kannappa Ticket Rates : నా కక్కుర్తి కోసం టికెట్ రేట్లు ను పెంచను

Kannappa Ticket Rates : నా కక్కుర్తి కోసం టికెట్ రేట్లు ను పెంచను

Kannappa Ticket Rates : ఒకప్పుడు సినిమా సక్సెస్ ను చెప్పడానికి ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లు ఆడాయి అంటూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దానిపైన సక్సెస్ డిపెండ్ అయి ఉంది. ఇప్పటికీ చాలా సినిమా పోస్టర్ల పైన నాన్ బాహుబలి రికార్డ్స్ అని పడుతూ ఉంటుంది. అయితే బాహుబలి రికార్డ్స్ కొట్టడం కోసం కూడా సినిమా టిక్కెట్ రేట్లు హైట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. రీసెంట్గా పుష్ప సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్టును సొంతం చేసుకుందాం. దీనికి కారణం పుష్ప సినిమా టికెట్ రేట్లను చెప్పాలి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడంతో, అలానే మంచి పాజిటివ్ టాక్ రావడంతో, టికెట్ రేట్లు కూడా కలిసి రావడంతో అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రతిసారి కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి టికెట్ రేట్ల హైక్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కనప విషయంలో కూడా కొన్నిచోట్ల అది జరిగింది. దీనిపై మంచి విష్ణు కన్నప్ప ప్రెస్ మీట్ లో స్పందించారు.


టికెట్ రేట్ల హైక్ గురించి 

తెలంగాణలో ఎటువంటి టికెట్ హైక్ లేదు. ఏరోజైతే మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు తగ్గుతాయో.. అప్పుడే నేను టికెట్ హైక్ అడుగుతాను. నా కక్కుర్తి కోసం సినిమా టిక్కెట్ రేట్లు పెంచను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువమంది ఫ్యామిలీస్ తో వెళ్లాలి. వాళ్లకి నేను ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్నిచోట్ల మాత్రమే టికెట్ హైక్ జరిగింది. కేవలం 50 రూపాయలు మాత్రమే కొన్ని సెంటర్స్ లో పెంచడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ లో కూడా పిల్లలకు కేవలం 12 డాలర్లు మాత్రమే పెట్టాము. పెద్దలకు 14 డాలర్లు పెట్టాము. నా ఉద్దేశం ఏమిటంటే ఈ సినిమా పిల్లలు ఎక్కువగా చూడాలి.


అన్ని అలానే తెలుసుకున్నాను 

నాకు ఈ రోజు రామాయణం మహాభారతం తెలిసింది కూడా ఆదివారం వస్తే నేను వెళ్లి టీవీ ముందు కూర్చునేవాడిని. ఎన్నో కామిక్స్ బుక్స్ ఉండేవి. రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలానే కన్నప్ప, రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన దేవుని గురించి కేవలం సినిమాల ద్వారా కామిక్స్ బుక్స్ ద్వారా తెలిసింది. ఇప్పట్లో కామిక్స్ బుక్స్ లేవు కాబట్టి కేవలం సినిమా ద్వారానే పిల్లలకు అన్ని విషయాలు తెలియాలి. ఈ సినిమాను రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్లకి ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా రాశాం. అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

Also Read : Coolie Telugu Rights : ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టలేం… కూలీ తెలుగు రైట్స్‌పై దిల్ రాజు

Related News

AA22× A6: అల్లు అర్జున్ సినిమా కోసం హాలీవుడ్ మార్కెటింగ్ హౌస్.. ఆస్కార్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారే ?

Anudeep Kv : వాళ్ల సినిమా ప్రమోషన్స్ లో నీ హైలెట్స్ ఏంటన్నా? మళ్లీ అవే కుళ్ళు జోక్స్

Jayam Ravi: భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకు స్టార్‌ హీరో

Rajinikanth: బాలీవుడ్ లో సత్తా చాటిన తలైవా.. రెండో సినిమాగా కూలీ రికార్డ్!

Anupama Parameswaran: కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా కనపడవు.. అనుపమ ఎమోషనల్ !

Shalini Pandey: షాలిని పాండే షాకింగ్‌ లుక్‌.. టాప్‌ తీసేసి.. పుస్తకం చదువుతూ.. ఏంటీ ప్రీతి ఈ ఆరాచకం

Big Stories

×