Pineapple Juice: పైనాపిల్ జ్యూస్(Pineapple Juice) రుచికరమైనది. అంతే కాకుండా ఇది విటమిన్ సి, మాంగనీస్, బ్రోమెలైన్ వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాపును కూడా తగ్గిస్తుంది. అయితే.. ఎంత మంచిదైనా అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు తప్పవు. పైనాపిల్ జ్యూస్ అతిగా తాగడం వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా.. పైనాపిల్ జ్యూస్‌లో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరం. అదనంగా.. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఒక కప్పు పైనాపిల్ జ్యూస్‌లో సుమారు 25 గ్రాముల చక్కెర ఉంటుంది. అంతే కాకుండా ఇది సాఫ్ట్ డ్రింక్స్‌కు సమానం.
పైనాపిల్ జ్యూస్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ, కొంతమందికి కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. ప్రత్యేకించి.. ఖాళీ కడుపుతో అధిక మొత్తంలో ఫైనాపిల్ జ్యూస్ తాగినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
బ్రోమెలైన్ రక్తస్రావాన్ని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది రక్తం పలుచబడటానికి మందులు (blood thinners) తీసుకుంటున్న వ్యక్తులు లేదా ఆపరేషన్స్‌కు సిద్ధమవుతున్న వారు పైనాపిల్ జ్యూస్ తాగకుండా ఉండటం మంచిది. ఇది గాయాలను నయం చేయడంలో ఆలస్యం చేస్తుంది.
కొంతమందికి పైనాపిల్ వల్ల అలెర్జీలు రావచ్చు. పైనాపిల్ జ్యూస్ తాగిన తర్వాత నోటి చుట్టూ దురద, దద్దుర్లు, గొంతులో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే, అది అలెర్జీసైడ్ ఎఫెక్ట్ కావచ్చు. పైనాపిల్ పండ్లు పండించడానికి ఉపయోగించే పురుగుమందులు కూడా కొందరికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి.
పైనాపిల్ జ్యూస్‌లో అధిక ఆమ్లత్వం ఉంటుంది. దీనిని ఎక్కువగా తాగడం వల్ల దంతాల ఎనామెల్ క్షీణించి, దంతాలు సున్నితంగా మారతాయి. తరచుగా ఇలాంటి జ్యూస్ లు తాగితే.. ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గుండెల్లో మంట (heartburn) లేదా యాసిడ్ రిఫ్లక్స్ (acid reflux) సమస్యలు ఉన్నవారికి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల లక్షణాలు మరింత తీవ్రతరం కావచ్చు.
Also Read: వీళ్లు.. గుమ్మడి గింజలు అస్సలు తినకూడదు !
చివరగా.. పైనాపిల్ జ్యూస్(Pineapple Juice) కొన్ని మందులతో కలిసి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. బ్రోమెలైన్ యాంటీబయాటిక్స్, రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల ప్రభావాలను మార్చగలదు. అందుకే.. ఏదైనా మందులు వాడుతున్న వారు పైనాపిల్ జ్యూస్ తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
పైనాపిల్ జ్యూస్ ప్రయోజనకరమైనది అయినప్పటికీ.. దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా.. పైన పేర్కొన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు జాగ్రత్తలు వహించాలి. నీటితో కలిపి పలచగా చేసుకోవడం లేదా భోజనంతో పాటు దీనిని తీసుకోవడం వంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: నేరేడు పండ్లు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలు అస్సలు రావు