Nithiin Removed From Yellamma: అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్లో రాబోయో మోస్ట్ అవైయిట్ చిత్రాల్లో ‘ఎల్లమ్మ‘ ఒకటి. ‘బలగం‘ తర్వాత డైరెక్టర్ వేణు, దిల్ రాజు కాంబోలో వస్తున్న చిత్రమిది. నితిన్ హీరో. ఈ ప్రాజెక్ట్ని ప్రకటించి సుమారు రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి కదలికలు లేవు. ఈ సినిమా సెట్స్పైకి ఎప్పడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ మూవీ ఈవెంట్కి వచ్చిన అదిగో ఎల్లమ్మ వచ్చేస్తుంది..ఇదిగో ఎల్లమ్మ వచ్చేస్తుంది అంటూ దిల్ రాజు ఊరిస్తు వస్తున్నారు. కానీ, కొన్ని రోజులు దిల్ రాజు ఈ సినిమా విషయంలో సైలెంట్ అయ్యారు. ప్రెస్మీట్, మూవీ ఈవెంట్లో ఫ్యాన్స్ నుంచి దీనిపై ప్రశ్న ఎదురైన దాటేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లమ్మ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం డైరెక్టర్ వేణు వెయిట్ చేసి చేసి విసిగిపోయాడని, దిల్ రాజు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సితార ఎంటర్టైన్మెంట్స్లో మరో మూవీకి కమిటైనట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగులు వినిపిస్తున్నాయి. నాగవంశీ వేణుకి అడ్వాన్స్ కూడా ఇచ్చాడని, సితార బ్యానర్లో చేయబోయే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడని ఫిలిం దూనియాలో గుసగులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎల్లమ్మ సినిమాలో నితిన్ని హీరోగా ప్రకటించారు. కానీ, ఈ మధ్య నితిన్ కెరీర్ పెద్దగా హిట్ లేదు. దిల్ రాజు బ్యానర్లో నితిన్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల తమ్ముడు సినిమాతో భారీ డిజాస్టర్ చూశారు దిల్ రాజు, నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్తో ఎల్లమ్మ తీయడం రిస్క్ అని దిల్ రాజు నిర్ణయించుకుని.. ఈ సినిమాకు హీరో నానిని అనుకున్నారట.
ప్రస్తుతం నాని వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉండటంతో సినిమా చేయలేనని చెప్పాడట. దీంతో మూవీ టీం మళ్లీ నితిన్ కలిసిందట. అంత ఒకే అనుకునేసరికి తమ్ముడు మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో దిల్ రాజు మరో యంగ్ హీరో శర్వానంద్ని కలిశాడట. శర్వానంద్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దానిని తర్వాత ఈ సినిమా చేస్తానని చెప్పడం దిల్ రాజు ఇక నితిన్తోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయతే, ఈసారి బడ్జెట్ ఇష్యూ రావడంతో ఎల్లమ్మ.. బెల్లంకొండ హీరో దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోగా సాయి శ్రీనివాస్ని తీసుకుంటున్నారట. దీనికి కారణం అతడి తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు. నిజానికి ఎల్లమ్మ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ కథ చాలా బాగుంటుంది, కరెక్ట్ హీరో పడాలే కానీ, ఇది పాన్ ఇండియా హిట్ ఖాయం.
దీంతో ఈ సినిమాను లేట్ చేయకూడదనే ఉద్దేశంతో దిల్ రాజు ఎల్లమ్మ కోసం మరో నిర్మాత బెల్లకొండ సురేష్ బాబు సాయం తీసుకుంటున్నారట. ఈ సినిమాకు ఆయన డబ్బులు పెట్టాలంటే.. తన కొడుకుతో ఈ సినిమా చేయాలని కండిషన్ పెట్టాడట. దీంతో ఎల్లమ్మ కోసం రంగంలోకి సాయి శ్రీనివాస్ వచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా హిట్స్తో దూకుడు మీద ఉన్నాడు. ఇటీవల కిష్కింధపురి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో దిల్ రాజు కూడా ఎల్లమ్మకు సాయి శ్రీనివాస్ని హీరోగా తీసుకునేందుకు సముఖత చూపించాడట. దీంతో ఫైనల్ ఎల్లమ్మ సినిమా నుంచి నితిన్ పోయి.. ఈ బెల్లంకొండ హీరో వచ్చాడు. మరి ఎల్లమ్మకు సాయి శ్రీనివాస్ న్యాయం చేస్తాడా అనేది ప్రస్తుతం అందరిలో సందేహం నెలకొంది.