Dark Chocolate Teaser: ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు రానా(Rana) ఇటీవల కాలంలో నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన, విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా రానా,సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై శశాంక్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డార్క్ చాక్లెట్(Dark Chocolate). ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్(Teaser) విడుదల చేయడంతో ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశ్వదేవ్ రాచకొండ(Vishwa Dev Rachakonda), బిందు మాధవి(Bindu Madhavi), రమేష్, రాకేష్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ టీజర్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ టీజర్ కనుక చూస్తే విశ్వదేవ్ ఇతరులతో మాట్లాడే సన్నివేశాలను హైలెట్ చేశారు అయితే ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా బూతు పదాలు కావడంతో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ టీజర్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా టీజర్ లోనే ఇన్ని బూతులు ఉంటే సినిమాలో ఇంకెన్ని బూతులు ఉంటాయో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ గురించి కూడా ఈ టీజర్ వీడియోలోనే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలో మీరే చెప్పండి అంటూ ప్రేక్షకులకు మూడు విడుదల తేదీలను ఇచ్చారు. అక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 ఈ మూడు తేదీలలో ఎప్పుడు సినిమాని విడుదల చేయాలనేది ప్రేక్షకుల అభిప్రాయానికే వదిలేశారు. మొత్తానికి ఈ టీజర్ మాత్రం సంచలనంగా మారింది. ఇక నటుడు విశ్వదేవ్ విషయానికి వస్తే ఇటీవల ఈయన “35 ఇది చిన్న కథ కాదు” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించిన విశ్వదేవ్ డార్క్ చాక్లెట్ సినిమాలో మాత్రం ఇలా బూతులు మాట్లాడుతూ కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విశ్వదేవ్ కి జోడిగా బిందు మాధవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బిందు మాధవి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా పలు వెబ్ సిరీస్ లలోను సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బిందు మాధవి ఇటీవల అగ్ని పరీక్ష కార్యక్రమానికి కూడా జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read: Yadammaraju -stella :ఇన్నాళ్లకు కూతురిఫేస్ రివీల్ చేసిన జబర్దస్త్ కమెడియన్..ఎంత క్యూట్ గా ఉందో!