Yadammaraju -Stella: జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ యాదమ్మ రాజు(Yadamma Raju) ఒకరు. ఈయన పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై సందడి చేశారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే యాదమ్మ రాజు మరొక నటి స్టెల్లా(Stella)ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గత ఏడాది అక్టోబర్ 11వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మించారు.
ఈ చిన్నారికి ముద్దుగా గిఫ్టీ అని పేరు పెట్టినప్పటికీ తన పేరు జెనీసా(Jenessa) అంటూ అందరికీ తన కుమార్తెను పరిచయం చేశారు. ఇక యాదమ్మ రాజు స్టెల్లా దంపతులు ఎప్పటికప్పుడు తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఎక్కడ తన కూతురి ఫేస్ కనపడకుండా జాగ్రత్తపడేవారు.ఇలా తన కుమార్తె బారసాల వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే ఎక్కడా కూడా తమ చిన్నారి ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నేడు తన కుమార్తె మొదటి పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుతున్న నేపథ్యంలో తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తన కుమార్తెకు సంబంధించిన కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ తమ కూతురు తమ జీవితంలోకి రావడంతో తమ ప్రపంచమే మారిపోయింది అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
విదేశాలలో తన కూతురితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను స్టెల్లా యాదమ్మ రాజు దంపతులు షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు, నెటిజన్లు పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక నేడు తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే యాదమ్మ రాజు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు కమెడియన్ గా సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
ఇక స్టెల్లా కూడా పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి యాదమ్మ ఈవెంట్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇటు సినిమాలలోను బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు బిజినెస్ లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక నేడు తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా తమ కూతురికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Rashi Khanna: ప్రేమలో నటి రాశి ఖన్నా..ఒకటి కాదు ఏకంగా రెండు లవ్ స్టోరీలు!