Jeevitha Rajasekhar : కొన్ని సినిమాలకు సంబంధించి క్రెడిట్ విషయంలో విపరీతమైన డిఫరెన్సెస్ వస్తుంటాయి. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నా కూడా, ఒక ప్యాషన్ మంచి పేరు గుర్తింపు సాధించాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంటారు చాలామంది. ఆ గుర్తింపును వేరే వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా బాధగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి.
ఇప్పటికీ కూడా చాలామంది క్రెడిట్ విషయంలో గొడవ పడుతుంటారు. కొంతమంది ఘోస్ట్ రైటర్స్ ని పెట్టుకుని వాళ్లు పేరు సంపాదించుకుంటారు. ఇకపోతే ఒక దర్శకుడుని ప్రముఖ నటుడు రాజశేఖర్ మరియు జీవిత ఒక సినిమా విషయంలో విపరీతంగా బాధపెట్టారట. సినిమా మొదలైనప్పుడు ఒకలా ప్రవర్తించి, సినిమా అయిపోయే టైం కి ఇంకోలా బిహేవ్ చేశారట. ఆ దర్శకుడు మరెవరో కాదు సముద్ర.
రాజశేఖర్ నటించిన సినిమా ఎవడైతే నాకేంటి. సినిమాకి సంబంధించి డైరెక్టర్ టైటిల్స్ లో జీవిత రాజశేఖర్ మరియు సముద్ర పేరు పడుతుంది. అయితే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్షన్ చేశారా అనేది చాలామందికి వచ్చే ఆలోచన. అసలు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు.
ఈ విషయాల్లో ఇద్దరూ తమ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ గా ఉన్న విషయాన్ని మాట్లాడారు. రాజశేఖర్ కూడా గతంలో దీని గురించి క్లారిటీ ఇచ్చారు కానీ జరిగిన విషయం మరొకటి. రాజశేఖర్ మాట్లాడుతూ సముద్రా కి పోలీసుల గురించి వాటి గురించి సరిగ్గా అవగాహన లేదు నేను చెప్పినా కూడా స్పీడ్ గా అందుకోలేకపోయాడు. అందుకే జీవిత దగ్గరుండి అన్ని చూసుకుంది అని చెప్పారు. కానీ సముద్ర వెర్షన్ కూడా ఒకటి ఉంది.
ఎవడైతే నాకేంటి సినిమాను చేద్దాం అని నాతో చెప్పినప్పుడు నేను కొన్ని చేంజెస్ చేశాను. వాళ్లు కూడా ఒప్పుకొని సూపర్ అన్నారు నాతో పాటు కథలో కూర్చున్నారు. నా జడ్జిమెంట్ మీద కూడా మంచి నమ్మకం రాజశేఖర్ కి ఉంది. అన్ని మాట్లాడుకుని పర్ఫెక్ట్ గా చేసి సినిమాను పూర్తి చేశాము. సినిమా ఒక లెవెల్ లో వచ్చింది.
ఫైనల్ కి వచ్చేసరికి వాళ్లలో ఎవరు ఒకడు పుల్ల పెట్టాడు. సినిమా మొత్తం నేనే చేశాను. అలా పూర్తి చేసిన తరుణంలో వాళ్లు కూడా కాపీ చూసుకొని ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేటట్టు ఉంది ఇప్పుడు సముద్రా ను తొలగిస్తే ఆ పేరు మనకు వస్తుంది అని అనుకున్నారు. అప్పటికే వాళ్ళవి రెండు సినిమాలు కూడా పోయాయి. వాళ్లతో ఉన్న ఒక రైటర్ నాకు ఈ విషయాన్ని చెప్పాడు.
నాకు ఆ పరిస్థితి అర్థం అయిన తర్వాత రాజశేఖర్ ఎవరైతే నాకేంటి షర్టుకు వచ్చి ఈ షాట్ ఏంటి ఆ ఫ్రేమ్ ఏంటి అని ఓవరాక్షన్ చేసేవాళ్ళు. ఊరికే కోపం అయిపోయే వాళ్ళు. పక్క నుంచి జీవిత సర్దుబాటు చేసినట్లు నటించేవాళ్ళు.
మొత్తానికి నాకు విషయం అర్థమై సార్ సినిమాకి డైరెక్షన్ మీ పేరు వేసుకుంటే వేసుకోండి అని నేను సైడ్ అయిపోయాను అని సముద్ర చెప్పాడు. ఇది మాత్రమే కాకుండా శేఖర్ అనే సినిమాకి లలిత్ అనే దర్శకుడుని కూడా ఇలానే పక్కన పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
Also Read: Trivikram Srinivas : పని అయిపోయింది పడిపోయాడు అనుకున్నారు, కానీ కెరటంలా పైకి లేచాడు