BigTV English

Rowdy Janardhan : పెళ్లయిన హీరోయిన్…ఎంగేజ్మెంటైన హీరో.. అసలేంటీ కథ?

Rowdy Janardhan : పెళ్లయిన హీరోయిన్…ఎంగేజ్మెంటైన హీరో.. అసలేంటీ కథ?

Rowdy Janardhan : చాలా రోజుల తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో సినిమా స్టార్ట్ అయింది. దిల్ రాజు ఈ ఏడాది మూడు సినిమాలు చేస్తే రెండు సినిమాలు అత్యంత భారీ డిజాస్టర్ అయ్యాయి. వీటి తర్వాత దిల్ రాజు నిర్మించే సినిమా ఒక్కటి కూడా సెట్‌పై లేదు. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు SVC 59 గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీ వస్తుంది. ఈ రోజు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ పూజ తర్వాత ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…


కింగ్ డం మూవీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ రోజు మార్నింగ్ పూజా కార్యక్రమాలతో మూవీ స్టార్ట్ అయింది. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో హీరో విజయ్ దేవరకొండ పక్కన మహానటి కీర్తి సురేష్ కనిపించింది.

కీర్తి సురేష్‌కు పెళ్లి తర్వాత నటిస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అలాగే ఇటీవల సీక్రెట్‌గా హీరోయిన్ రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండకు కూడా… ఇది ఎంగేజ్మెంట్ తర్వాత ఇదే మొదటి సినిమా పూజా కార్యక్రమం.


పెళ్లయిన హీరోయిన్ – ఎంగేజ్మెంటైన హీరో

అలా… పెళ్లయిన హీరోయిన్…ఎంగేజ్మెంటైన హీరో ఒకే సినిమాలో నటించడం, వారి ఫోటోలు వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా అయినా… ఇద్దరు కమిటెడ్ హీరో, హీరోయిన్లు ఒక సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

పైగా విజయ్ దేవరకొండ – కీర్తి సురేష్ కాంబో చాలా ఫ్రెష్. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయలేదు. కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేశాడు. దాంట్లో… విజయ్ కి జంటగా సమంత నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఏది ఏమైనా.. ఈ కమిటెడ్ జంట… ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించడం అనేది సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయితే అయింది. వారి ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా, విజయ్ దేవరకొండ దీంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్‌తో ఉంది. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ట్యాక్సివాలా మూవీ వచ్చింది. ఇప్పుడు VD 13గా మరో సినిమా చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో రాయలసీమ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందట. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీంట్లో విజయ్ దేవరకొండ ప్రేయసి, ఇటీవల సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది అంటున్న రష్మిక మందన్నానే హీరోయిన్. ఈ మూవీ స్టార్ట్ సంవత్సరం పైనే అవుతుంది.

ఇది పట్టాలపైన ఉన్నప్పుడే, దిల్ రాజు బ్యానర్‌లో సినిమా స్టార్ట్ చేశాడు విజయ్. దీనికి రౌడీ జనార్ధన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజుల క్రితమే నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఇది కూడా రాయలసీమ నేపథ్యంలోనే ఉంటుందట.

Related News

‎Raviteja: ఆమెలో మగ లక్షణాలే ఎక్కువ..ఆ లేడీ డైరెక్టర్ పై రవితేజ కామెంట్స్!

Kiran Abbavaram: పక్క స్టేట్ హీరోని కించపరిచొద్దు.. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!

Telusu Kada Trailer : ఇబ్బందుల్లో పడ్డ తెలుసు కదా చిత్ర యూనిట్, చివరి నిమిషంలో ఇలా

Ram Charan – PM Modi: ప్రధాని మోడిని కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… బహుమతి అందజేత

Deepika Padukone: రోజుకి 8 గంటల వర్క్‌.. దీపికా చెప్పిన ఆ స్టార్‌ హీరో ఇతడే.. అభిషేక్‌ కామెంట్స్‌ వైరల్‌

Sai Durga Tej: టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభించిన మోగా హీరో

Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన

Dark Chocolate Teaser: డార్క్ చాక్లెట్ టీజర్ రిలీజ్.. టీజర్ మొత్తం బూతులే !

Big Stories

×