Tollywood Directors : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. అలాంటి డైరెక్టర్ల ఫ్యామిలీల గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. తెలుగులో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వారి భార్యలు ఏం చేస్తుంటారు? భర్తలకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారా? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన టాప్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి.. బాహుబలి మూవీతో వరల్డ్ ఫేమస్ డైరెక్ట్ అయిపోయాడు ఈయన.. ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసి మరోసారి తన సత్తాని చాటాడు. ఈ సినిమాకు ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈయన భార్య పేరు రమా రాజమౌళి.. రమా ఆయన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటారు. సినిమాకు సంబంధించిన పలు బాధ్యతలు, హీరోల మేకప్, డ్రెస్సింగ్ విషయాలన్నింటీని ఆమె దగ్గరుండి చూసుకుంటారు.
రంగస్థలం, పుష్ప సిరీస్ సినిమాలతో మాస్ డైరెక్టర్గా పాపులర్ అయిన సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తెరకెక్కించిన సినిమాలు ఆ రెంజ్ లో ఉండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు పోటీ పడుతున్నారు. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు.. ఇటీవలే తన కూతుర్ని సినిమాల్లోకి లాంచ్ చేశాడు. ఆయన భార్య పేరు తబిత సుకుమార్. ఆమె ఓ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తకు సినిమాల్లో తోడుగా ఉంటారు కూడా..
సక్సెస్ఫుల్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈమధ్య ఈయన తర్కెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ మాస్టర్ హిట్గా నిలవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈయన ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. అనిల్ రావిపూడి భార్య పేరు భార్గవి. ఈమె గృహిణిగా తన కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయనను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా మాటలు మాంత్రికుడు అని పిలుస్తారు. ఈయన భార్య పేరు సాయి సౌజన్య. ఈమె ఒక నాట్య కళాకారుని అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Also Read : ‘ఇంటింటి రామాయణం’ శ్రీకర్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
టాలీవుడ్‌కు ఎన్నో సాలిడ్ హిట్స్ అందించిన వంశీ పైడిపల్లి సతీమణి పేరు మాలిని.. ఈమె హౌస్ వైఫ్ గా తన ఫ్యామిలీని చూసుకుంటున్నారు. తన భర్తతో కలిసి అప్పుడప్పుడు షూటింగ్లకు వెళుతూ ఉంటారు. వీరికి ఒక పాప కూడా ఉందన్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్, ప్రశాంత్ వర్మ, బోయపాటి శ్రీను, కొరటాల శివ ఇలా చాలామంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ భార్యలు తమ భర్తలకు సినిమాల విషయంలో సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది టాలీవుడ్ డైరెక్టర్లు తమ భార్యల సహకారంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు.