Hrithik Roshan:బాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇటీవల ‘వార్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా థియేటర్లలో సత్తా చాటలేని ఈ సినిమా ఇటు ఓటిటిలో రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. కియారా అద్వానీ(Kiara advani)హీరోయిన్ గా.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇలాంటి శుభ సమయాన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును , క్రేజ్ ను దుర్వినియోగం చేస్తున్నారు అని , ఫోటోలు, వీడియోలు తప్పుదోవలో ఉపయోగిస్తున్నారు అంటూ పిటిషన్ లో తెలిపారు. ఇకపోతే హృతిక్ రోషన్ వేసిన పిటిషన్ ను నేడు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా విచారించనున్నారు. ముఖ్యంగా వాణిజ్య లాభం కోసం తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నారని ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం జరగాలి అంటూ హృతిక్ రోషన్ తన పిటిషన్ లో తెలుపుతూ.. సంబంధిత పార్టీల పేర్లను పిటిషన్ లో ప్రస్తావించారు. దీంతో నేడు జరగబోయే విచారణలో జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే హృతిక్ రోషన్ కంటే ముందే బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు అని, ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా ఉపయోగిస్తున్నారని, అశ్లీల కంటెంట్ లో ఉపయోగిస్తూ.. తమ మర్యాదకు భంగం కలిగిస్తున్నారు అంటూ తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడుతున్నారని వాణిజ్య ప్రకటనలలో ఉపయోగించి లాభపడుతున్నారు అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలా ఇప్పటికే మోహన్ బాబు (Mohan Babu), నాగార్జున(Nagarjuna) తో పాటు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) అమితాబ్ బచ్చన్((Amitabh Bachchan), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), అనిల్ కపూర్ (Anil Kapoor) ప్రముఖ సింగర్ కుమార్ సాను తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు సునీల్ శెట్టి (Sunil Shetty) కూడా తన హక్కులను కాపాడాలి అని ముంబై హైకోర్టును ఆశ్రయించారు.
ALSOREAD:Kannappa Movie : 8 ఏళ్ల తర్వాత కన్నప్ప సినిమా కోసం అలాంటి పని చేస్తున్న సన్ టీవీ!
ఇకపోతే వీరందరి పిటిషన్లను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఇకపై అలా జరగదని.. ఎవరైనా సెలబ్రిటీల అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు ఉపయోగించడం కానీ.. ఏఐ ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేయడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది.