Star Singer:సినీ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గ్రామీ అవార్డు విజేత R&B గాయకుడు డి’ఏంజెలో (51) గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పై కుటుంబ సభ్యులు ధ్రువీకరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.. “మా కుటుంబంలో మెరిసే నక్షత్రం.. ఈ జీవితంలో తన వెలుగును మసకబారించింది” అంటూ తెలిపారు. RCA సంస్థ కూడా ఆయనను సాటిలేని దార్శనికుడుగా అభివర్ణించింది..ఆయన సంగీత వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది అంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈయన మరణంతో అభిమానులు సినీ సెలెబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
డి’ఏంజెలో అసలు పేరు మైఖేల్ యూజీన్ ఆర్చర్.. అమెరికన్ ఆర్ అండ్ బి సంగీతకారుడు. రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ ఈయనను 200 మంది గొప్ప గాయకుల జాబితాలో 75వ స్థానంలో నిలిపింది. 1974 ఫిబ్రవరి 11న రిచ్మండ్, వర్జినియా అమెరికాలో జన్మించారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న ఈయన క్యాన్సర్ తో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన సంగీత కళాకారుడు మాత్రమే కాదు పాటల రచయిత , రికార్డు నిర్మాత, గాయకులు కూడా. ముఖ్యంగా పాటలు పాడడం లోనే కాదు పియానో, కీబోర్డు, గిటార్, డ్రమ్స్ వంటివి వాయించడంలో కూడా సిద్ధహస్తులు.
ఆర్ అండ్ బి సూపర్ గ్రూప్ బ్లాక్ మెన్ యునైటెడ్ ద్వారా 1994లో వచ్చిన “యు విల్ నో” అనే పాటకు సహా రచయితగా, సహ నిర్మాతగా చేసిన తర్వాత ఈయన అందరి దృష్టిని ఆకర్షించారు. అతని తొలి స్టూడియో ఆల్బమ్ బ్రౌన్ షుగర్ రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ద్వారా ప్లాటినం సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సంగీత విమర్శకుల నుండి విస్తృత ప్రశంసలు కూడా అందుకుంది.
ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సె*క్స్ సింబల్గా తన హోదా గురించి మరింత స్పృహలోకి వచ్చిన ఈయిన అసౌకర్యంగా భావించారట. ఆ తర్వాత వర్జినియాలోని రిచ్మండ్ లో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం ఎవరికీ కనిపించకుండా పోయిన ఈయన మళ్లీ సంగీతంపై దృష్టి పెట్టి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన..”ముఖ్యంగా ప్రజలు తనను అలాంటి వ్యక్తి అని సంబోధించినప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయానని, ఏ అభిమాని అయిన తనకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో తాను ఉండిపోయానంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన స్నేహితురాలు కూడా అతడిని విడిచి వెళ్లిపోయిందట. ఆఖరికి తన న్యాయవాది కూడా తనపై అసంతృప్తి చెందాడట. ఇక దాంతో కుటుంబంలో చాలామంది తనతో సంబంధాలు పెట్టుకోలేదు.. సొంత మేనేజర్ కూడా ఆయనను విడిచి వెళ్లిపోయారంటూ” తెలిపారు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు డి’ఏంజెలో. ఏదేమైనా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈయన ఆ తర్వాత క్యాన్సర్ బారినపడి ఇప్పుడు తుదిశ్వాస విడిచారు.
ALSO READ:Bigg Boss Thanuja : నాన్న కాదు… ఇక నుంచి సార్… బయటపడ్డ తనూజ అసలు రంగు..