OG Movie:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమా తర్వాత ‘దే కాల్ హిమ్: ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ డైరెక్టర్ సుజీత్(Sujeeth ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హస్మి (Imraan hasmi) విలన్ గా తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇమ్రాన్ హస్మి నటన చూసి ఈయన టాలెంట్ ను బాలీవుడ్ ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయింది అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేశారు. అంతలా తన టాలెంట్ తో సినిమాలో తనను తాను నిరూపించుకున్నారు ఇమ్రాన్ హస్మి.
శ్రేయ రెడ్డి , శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్ ఇలా పలువురు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పినా.. సినిమా లవర్స్ కి మాత్రం ప్లేట్ మీల్స్ అనడంలో సందేహం లేదు. వన్ టైం వాచింగ్ మూవీ అంటూ సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్ వస్తే ఎలాంటి కథతో వస్తుందని అందరూ ఆలోచనలో పడగా డైరెక్టర్ సుజీత్ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు ఆయన ప్రీక్వెల్ స్టోరీ కూడా రివీల్ చేయడం జరిగింది. దీనిపై సుజీత్ మాట్లాడుతూ..” ప్రీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. ఇది సుభాష్ చంద్రబోస్ ఇండియా నుండి ప్రజలను జపాన్ కి ఎలా తీసుకెళ్లాడు? ఆ కాలంలో ఏం జరిగింది? అనే అంశాలతో రాబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంటూ క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.. ప్రీక్వెల్ మూవీలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన అయితేనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారని, అందుకే సుజీత్ పక్కాగా ప్లాన్ చేసి మరీ అమితాబ్ ను కలిసి.. కథ వినిపించి ఈ పాత్రకు ఒప్పించబోతున్నారు అంటూ ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ట్విస్ట్ ఎవరు ఊహించి ఉండరు అనడంలో సందేహం లేదు.
అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హరిహర వీరమల్లు సినిమా సమయంలో మూడు చిత్రాలను ఫినిష్ చేస్తానని మాట ఇచ్చారు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు కి సీక్వెల్ ప్రకటించారు. అలాగే ఓజీకి ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ: Big Breaking: ప్రముఖ డైరెక్టర్ తల్లి మృతి.. ఎలా జరిగిందంటే?