Hyderabad News: నామ రూపాల్లేకుండా పోయిన బతుకమ్మ కుంటకు హైడ్రా పుణ్యమానికి పూర్వ వైభవం వచ్చింది. దాని ఫలితంగా శుక్రవారం ప్రారంభానికి రెడీ అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మకుంట ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ సిటీవాసులు ఇప్పుడు బతుకమ్మకుంట గురించి చర్చించుకుంటున్నారు. దాని రూపురేఖలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మా ఏరియాల్లో అలాంటి చిన్నపాటి లేక్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. తక్కువ సమయంలో కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా.
హైదరాబాద్ సిటీలోని అంబర్‌పేట ప్రాంతంలో బతుకమ్మకుంట ఆక్రమణకు గురైంది. 1962–63 లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో 14 ఎకరాల 6 గుంటలు ఉండేవి. బఫర్ జోన్‌తో కలిపి 16 ఎకరాల్లో 13 గుంటలు ఉండేది. సిటీ పెరగడంతో కబ్జాదారుల చూపు ఆ ప్రాంతంపై పడింది. కాల క్రమేణా ఆక్రమణలకు గురైంది.
చివరకు ఐదు ఎకరాల 15 గుంట భూమిలో హైడ్రా డెవలప్ చేసింది. అందుకోసం రూ.7.40 కోట్ల ఖర్చు చేసింది. బతుకమ్మ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకునేందుకు ఏరియా, ఓపెన్ జిమ్, వాక్ వే మిగతా ప్రాంతాల్లో చెట్లు నాటారు అధికారులు.
ALSO READ: హైదరాబాద్‌లో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాలు జలమయం
చాలావరకు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. బతుకమ్మకుంటలో ముళ్ల కంపలు, చెత్తా చెదారం వేసేవారు ఇరుగుపొరుగువారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత దాని రూపురేఖలు మారిపోయాయి. ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఎక్స్‌కవేటర్లతో తవ్వగా మీటరు లోతు నీరు వచ్చింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టింది.
కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలకు కుంటలో నిండుకుండలా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మకుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో బతుకమ్మ పండుగకు రెడీ అయ్యింది.
కుంట చాలావరకు కబ్జా అయ్యింది. నిర్మాణ వ్యర్థాలతో బతుకమ్మ చెరువును ఆనవాళ్లు లేకుండా పూడ్చేశారు. ఆ భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో దశాబ్దాలుగా పోరాటం చేశాడు ఓ వ్యక్తి. ఈ విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. బతుకమ్మకుంట చుట్టూ పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. కేవలం మూడోవంతు మాత్రమే అక్కడ మిగిలింది.
Bathukamma Kunta Grand Opening
September 26th 2025@revanth_anumula @Bmaheshgoud6666 @MNatarajanINC pic.twitter.com/nYvxLz52So
— Telangana Congress (@INCTelangana) September 25, 2025