Dussehra 2025: దసరాను అశ్విన మాసంలోని శుక్ల పక్షంలో పదవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 2న వస్తుంది. ఈ రోజున గ్రహాలకు అధిపతి అయిన బుధుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. దసరా రోజున సాయంత్రం 5:25 గంటలకు కన్యారాశిలో ఉదయిస్తాడు. తరువాత.. అంటే అక్టోబర్ 3న తెల్లవారుజామున 3:36 గంటలకు తులారాశిలో సంచరిస్తాడు. బుధుని నిరంతర సంచారం12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశుల వ్యక్తులు వ్యాపారంలో లాభాలు, కెరీర్‌లో శుభవార్త, సంబంధాలలో ప్రేమ, పరీక్షలలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి.. ఈ అదృష్ట రాశుల పేర్లను తెలుసుకుందాం.
కన్య రాశి:
ఈ సమయంలో కన్య రాశి వారు శుభ వార్తలను అందుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సమయంలో.. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయాలు పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా దాని నుంచి ప్రయోజనాలు పొందుతారు. పనిలో పదోన్నతి నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటాయి. యువతకు కొత్త కెరీర్ మార్గాలు లభిస్తాయి. కుటుంబంతో కూడా సంతోషంగా గడుపుతారు,
తులా రాశి:
తులా రాశి వారి పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అంతే కాకుండా మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ సంచారం మీ ప్రసంగంపై గణ నీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కమ్యూనికేషన్ మీ పనిపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఇది గణనీయమైన ప్రయోజనాలను తెచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కొత్త అవకాశాలు కూడా అందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న వారు ఇప్పుడు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుంది. అయితే.. ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసుల్లో గౌరవం , ముఖ్యమైన బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ఫలితంగా మీరు డబ్బు సంబంధించే అవకాశాలు కూడా చాలా వరకు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకర రాశి:
మకర రాశి వారు తమ పెట్టుబడులలో మంచి ఫలితాలను చూస్తారు. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా మీ విచక్షణను ఉపయోగించి.. ఉజ్వల భవిష్యత్తును సృష్టించే నిర్ణయాలు తీసుకుంటారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా కనిపిస్తుంది. మకర రాశి వారు తమ లక్ష్యాలను సకాలంలో సాధించడం వల్ల సంతృప్తిని పొందుతారు. మీ ప్రసంగం ఆకట్టుకుంటుంది. చాలా మంది కొత్త వ్యక్తులు మీతో కనెక్ట్ అవుతారు. కొత్త ప్రదేశాలు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంతే కాకుండా కుంటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది.