TVK Vijay: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీవీకే పార్టీ అధినేత విజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు.
ఘటన ఎంతో కలిచివేసింది…
కరూర్ తొక్కిసలాట ఘటన తనను ఎంతోగానూ కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు.. ఎంతో ప్రేమతో తన నిర్వహించిన మీటింగ్ కు ప్రజలు భారీ గా వచ్చారని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పిస్తానని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే నిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఏ తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని అన్నారు.
కావాలంటే సీఎం స్టాలిన్ తనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు.
మరింత బలంగా బయటకు వస్తా..
ఇలాంటి ఘటన కరూర్ లోనే ఎందుకు జరిగింది..? అనేది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఎలా జరిగిందో అసలు తెలియడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగిందని పేర్కొన్నారు. తాను ఇప్పుడు మరింత బలంగా బయటకు వస్తానని తెలిపారు.
ALSO READ: Minor Girl Molested: ఏపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి
గుండె బాధతో మునిగిపోయింది.. విజయ్ ఎమోషనల్
ఈ ఘటన గురించి ఆలోచిస్తుంటే.. తన గుండె బాధతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదుర్కొలేదని అన్నారు. తొక్కిసలాటలో41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సందని.. మా నేతల తప్పులు లేకపోయినా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని టీవీకే పార్టీ అధినేత విజయ్ పేర్కొన్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ దళపతి ఫస్ట్ రియాక్షన్..!
నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించలేదు
తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది
ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది
నా గుండె ముక్కలైంది, మాటలు రావట్లేదు
త్వరలో మృతుల కుటుంబీకులను,… pic.twitter.com/W5D0bx54bj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025