Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. తెలుగులో 9వ సీజన్ ప్రారంభం అయ్యింది. అప్పుడే మూడువారాలు కూడా ముగిసాయి. ఇక నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలయ్యింది. అయితే ఈసారి నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య మాటలు నోరు జారుతుండడం చూసి ఆడియన్స్ కి కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది అని చెప్పవచ్చు. వీరంతా తెలిసి మాట్లాడుతున్నారా? లేక తెలియక మాట్లాడుతున్నారా ? ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు? ఎలాంటి పదాలు వాడుతున్నారు? అనే విషయాలు మర్చిపోయారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అటు సంజనా ఇటు హరిత హరీష్ మళ్లీ నోరుజారారు. ఇక వీరికి ఈ వారం నాగార్జున చేతిలో బ్యాండ్ బాజానే అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా 23వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో ని మేకర్స్ విడుదల చేశారు.. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. అందులో భాగంగానే నామినేషన్స్ లో భాగంగా రాము రాథోడ్ ను ఉద్దేశించి సంజన “ఎక్కడి నుంచి వచ్చావు?”అంటూ సంబోధించింది. దీంతో ఆయన హర్ట్ అయిపోయారు..ఇదే విషయంపై శ్రీజ.. సంజనతో చెబుతూ ఈ పదం ఇలా వాడకూడదు అని చెప్పినప్పటికీ.. సంజన మాత్రం నా ఇంటెన్షన్ అంతే…నేను వేరే ఉద్దేశంతో చెప్పలేదు అని చెబుతుంది . ఇక రాము రాథోడ్ ను హరిత హరీష్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఆడియన్స్ చూసుకుంటారు అంటూ రాము రాథోడ్ తెలిపారు.
ఇమ్మానుయేల్ కూడా సంజనతో మాట్లాడుతూ.. కోపం వస్తే మాటలు వదిలేస్తారు. నీకు ఆ రోజు కూడా నేను చెప్పాను అంటూ తప్పు సంజనదే అన్నట్టుగానే ఇమ్మానుయేల్ కూడా మాట్లాడారు. నాకు తెలుగులో డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ తెలియదు అంటూ తెలిపింది. తర్వాత నామినేషన్ లో భాగంగా డైస్ ప్రక్రియను మొదలుపెట్టారు. అందులో కెప్టెన్ పవన్ డైస్ తిరగవేయగా.. అక్కడ నామినేట్ వచ్చింది. దాంతో రీతూ చౌదరి శ్రీజను నామినేట్ చేసింది.
అలాగే ఫ్లోరా షైనీ హరీష్ ను నామినేట్ చేసింది. ఫ్రెండ్షిప్ లో ఒక రూల్ ఉంది నమ్మకం లేని చోట ఫ్రెండ్షిప్ ఉండదు అంటూ చెప్పగా.. మీలాంటి స్నేహితులు నాకు అవసరం లేదు అంటూ ముఖం మీద చెప్పేశారు హరిత హరీష్. అలాగే రాము రాథోడ్ కూడా హరీష్ ను నామినేట్ చేశారు. అంతేకాదు ఆఖరికి తనూజ కూడా హరీష్ ను నామినేట్ చేసింది. మిమ్మల్ని బట్టే నా ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి అంటూ ఫైర్ అయిపోయింది. రాము మాట్లాడుతూ..” అత్త మీద కోపం దుత్త మీద చూపించకండి. ఇక్కడ మా పాయింట్ ఒకటే” అంటూ చెబుతూ ఉండగా.. తనూజ మధ్యలో అరే ఆయన మాట వినడు అని చెబుతుండగానే.. హరీష్ మళ్లీ ఫైర్ అవుతూ..”అత్త పక్కన దుత్తలే కదా మీరందరూ” అంటూ నోరు జారారు. ఇలా కంటెస్టెంట్స్ సంజన, హరీష్ తమ మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి వీకెండ్స్ లో నాగార్జున వీరికి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
ALSO READ: Shukracharyudu in Mahakali : ప్రశాంత్ యూనివర్స్‌లో శుక్రాచార్యడు… పురాణాల్లో ఈయన పాత్ర ఏంటో తెలుసా ?