Cheese Pasta: చీజ్ పాస్తా అంటే ఇష్టపడని వారుండరు. ఇది తయారు చేయడం చాలా సులభం, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, యువకులు దీన్ని బాగా ఇష్టపడతారు. క్రీమీ టెక్చర్‌తో.. చీజ్ సువాసనతో ఉండే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు:
పాస్తా -1.5 కప్పులు
వెన్న- 2 టేబుల్ స్పూన్లు
మైదా పిండి -1.5 టేబుల్ స్పూన్లు
పాలు 2 కప్పులు (వేడి చేసినవి)
చీజ్ -1 కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
మిరియాల పొడి-1/2 టీస్పూన్
ఆలివ్ ఆయిల్-1 టీస్పూన్
వెల్లుల్లి-2 రెబ్బలు
ఆరిగానో / చిల్లీ ఫ్లేక్స్-1/2 టీస్పూన్
1. పాస్తా ఉడకబెట్టడం:
ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీరు తీసుకుని.. కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి.
నీరు మరుగుతున్నప్పుడు, పాస్తా వేసి, ప్యాకెట్‌పై సూచించిన సమయం వరకు (సాధారణంగా 8-10 నిమిషాలు) లేదా అల్ డెంటె (al dente – కొద్దిగా మెత్తగా) అయ్యేంత వరకు ఉడికించాలి.
పాస్తా ఉడికిన తర్వాత, నీటిని వడకట్టి, పాస్తాను చల్లటి నీటితో కడగాలి (ఇలా చేయడం వలన అతుక్కోకుండా ఉంటుంది). పాస్తా ఉడికించిన నీటిలో కొద్దిగా పక్కన ఉంచండి.
2. క్రీమీ చీజ్ సాస్ (వైట్ సాస్) తయారీ:
ఒక మందపాటి పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసి తక్కువ మంటపై కరిగించండి.
వెన్న కరిగిన తర్వాత, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి, సువాసన వచ్చే వరకు సుమారు 30 సెకన్లు వేయించండి.
ఇప్పుడు, 1.5 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి, ఉండలు కట్టకుండా 1 నిమిషం పాటు నెయ్యిలో వేయించండి.
పిండి కొద్దిగా రంగు మారిన తర్వాత, 2 కప్పుల వేడి పాలను కొద్దికొద్దిగా పోస్తూ, కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వలన సాస్ ఉండలు కట్టకుండా క్రీమీగా తయారవుతుంది.
సాస్ కొద్దిగా చిక్కబడిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేయండి.
3. చీజ్, పాస్తా కలపడం:
సాస్ కొద్దిగా చిక్కబడిన తర్వాత, స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, తురిమిన చీజ్‌ను (1 కప్పు) వేసి పూర్తిగా కరిగేంత వరకు కలపండి.
చీజ్ కరిగి సాస్‌లో పూర్తిగా కలిసిపోయి, క్రీమీగా మారిన తర్వాత, ఉడకబెట్టిన పాస్తాను అందులో వేసి కలపండి.
సాస్ మరీ చిక్కగా అనిపిస్తే.. ముందుగా పక్కన ఉంచుకున్న పాస్తా ఉడికించిన నీటిని కొద్దిగా వేసి కలుపుకోవచ్చు.
చివరగా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్‌ను చల్లి, బాగా కలిపి స్టవ్ ఆపేయండి.
వేడి వేడిగా, క్రీమీ క్రీమీగా ఉండే చీజ్ పాస్తాను వెంటనే వడ్డించండి. పైన కొద్దిగా చీజ్ తురుము లేదా తరిగిన పార్స్లీతో అలంకరిస్తే మరింత రుచిగా ఉంటుంది.
చిట్కా: ఎక్కువ చీజ్ రుచి కావాలంటే, సాస్‌లోచీజ్‌ను, లేదంటే మోజారెల్లా చీజ్‌ను ఉపయోగించండి.