OG success Meet : పవన్ కళ్యాణ్ కెరియర్ లో అభిమానులు ఆశించే రేంజ్ సక్సెస్ కొట్టి చాలా ఏళ్లు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒక మంచి సినిమా వస్తే ఆనందపడటం అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాతో కొంతమేరకు ఉపశమనం కలిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సినిమా ఊచకోతను మొదలుపెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లు సక్సెస్ ఈవెంట్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతుంటాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహిద్దాం అని చెప్పినప్పుడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సక్సెస్ కనిపించింది కదా మళ్లీ మనం ఎందుకు కనిపించడం అంటూ మాట్లాడారు. మొత్తానికి 12 సంవత్సరాల క్రితం వచ్చిన అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తన సినిమాను ఎవరు బయటకు పైరసీ చేశారో వాళ్లపైన కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు గట్టిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంత గట్టిగా మాట్లాడటం అదే మొదటిసారి. అప్పటికి ఇంకా జనసేన పార్టీని స్థాపించలేదు.
సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా సక్సెస్ సాధించింది అని డిసైడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమా రిసీవ్ చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్ రేపు సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ సక్సెస్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది. అందరూ ఊహించినట్టే పవన్ కళ్యాణ్ కూడా ఈ సక్సెస్ మీట్ కు హాజరు కానున్నారు.
ఈ సినిమా కన్సర్ట్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అభిమాని, సినిమా దర్శకుడు అయినా సుజీత్ పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఇది కొంతమందికి నిరాశ మిగిల్చింది. ఈ తరుణంలో సుజిత్ ఈ సక్సెస్ ఈవెంట్లో కంప్లీట్ గా మాట్లాడుతాడు అని అందరూ ఎక్కువగా ఊహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ కూడా జరిపారు. కానీ దాని అసలైన ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో సక్సెస్ మీట్స్ అనేవి సినిమా విడుదలైన సాయంత్రానికే పెట్టేస్తున్నారు. అప్పటికి ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కూడా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఓ జి విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులు తర్వాత సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది కాబట్టి సక్సెస్ ను ఒప్పుకోవాల్సిందే. అత్తారింటికి దారేది సినిమా తర్వాత జన్యూన్ గా జరిగే సక్సెస్ మీట్ ఓజి.
Also Read: OG Film : పవన్ ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు బెనిఫిట్స్, అసలైన రిజల్ట్ ఇప్పుడు తేలుతుంది