Arattai Features| భారతదేశంలో స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యువతను స్వదేశీ యాప్‌లు తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అరట్టై యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ మేడ్ ఇన్ ఇండియా, వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రజలను అరట్టైని ఉపయోగించమని కోరారు.
ఈ యాప్ సురక్షిత చాటింగ్‌ను వాగ్దానం చేస్తుంది. ఇది వైరల్‌గా మారింది. భారత్‌లో వాట్సాప్ ఆధిపత్యాన్ని తొలగించడానికి అరట్టై లో ప్రత్యేక ఫీచర్లు ఉండడమే కారణం.
డేటా ప్రైవసీ, విదేశీ యాప్‌లపై ఆధారపడటం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. వాట్సాప్‌పై వివాదాల నేపథ్యంలో స్వదేశీ యాప్‌ల డిమాండ్ పెరిగింది. అరట్టై అనేది జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన యాప్. తమిళంలో “అరట్టై” అంటే “చాట్” అని అర్థం. ఇది భారతీయులకు సురక్షిత, సులభమైన చాటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది.
భారత ప్రభుత్వం డిజిటల్ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. అరట్టై ఈ లక్ష్యానికి సరిపోతుంది. దీని డేటా సర్వర్లు భారత్‌లోనే ఉన్నాయి. ఇది యూజర్లకు ప్రైవసీపై నమ్మకం కల్పిస్తుంది. 2021లో లాంచ్ అయిన ఈ యాప్ ఇప్పుడు రోజుకు 3,50,000 సైన్-అప్‌లతో వైరల్ అవుతోంది.
అరట్టై యాప్ ఫీచర్లు
జోహో ప్రకారం, అరట్టై పూర్తిగా భారత్‌లో అభివృద్ధి చేయబడింది. డేటా దేశంలోనే సురక్షితంగా ఉంటుంది. కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. చాట్‌లకు త్వరలో సీక్రెట్ మోడ్‌లో ఎన్‌క్రిప్షన్ వస్తుంది. మీ మెసేజ్‌లు మీకు, రిసీవర్‌కు మాత్రమే పరిమితం మిగతా ఎవరూ రహస్యంగా చూడలేరు.
గ్రూప్ చాట్‌లు, బ్రాడ్‌కాస్ట్
టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్, కాల్స్ సులభంగా పంపవచ్చు. ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేయవచ్చు. 1,000 మంది వరకు గ్రూప్ చాట్‌లు సృష్టించవచ్చు. బ్రాడ్‌కాస్ట్ ఫీచర్‌తో ఒకేసారి చాలా మందికి మెసేజ్ పంపవచ్చు. చానెల్స్‌తో స్టోరీలా అప్‌డేట్స్ పోస్ట్ చేయవచ్చు.
యూజర్ ఫ్రెండ్లీ డిజైన్
అరట్టై ఇంటర్‌ఫేస్ చాలా క్లీన్, ఈజీగా ఉంటుంది. కొత్త యూజర్లు సులభంగా ఉపయోగించవచ్చు. తక్కువ ఇంటర్నెట్ డేటాతో కూడా బాగా పనిచేస్తుంది. భారత నెట్‌వర్క్‌లకు ఇది అనుకూలం. తక్కువ స్పెసిఫికేషన్ ఫోన్లలో కూడా లాగ్ లేకుండా పనిచేస్తుంది. అరట్టైని సృష్టించిన జోహో ఇందులో ఏమైనా బగ్‌లు ఉంటే త్వరగా సరిచేస్తుందని హామీ ఇచ్చింది.
మల్టీ-డివైస్ సపోర్ట్
ఫోన్, టాబ్లెట్, PC, ఆండ్రాయిడ్ టీవీలలో అరట్టై ఉపయోగించవచ్చు. డివైస్‌ల మధ్య సులభంగా మారవచ్చు. టీవీల ద్వారా మీటింగ్‌లు చేయవచ్చు. ఇందులో ఉన్న బహుముఖ ఫీచర్లు రోజువారీ ఉపయోగాన్ని పెంచుతాయి.. కనెక్ట్ చేసే డివైస్‌లపై పరిమితి లేదు.
స్మార్ట్ లొకేషన్ షేరింగ్
లొకేషన్ షేరింగ్ కొత్తగా ఉంది. ‘Till I Reach’ అంటే “నేను చేరే వరకు” ఆప్షన్ కూల్ గా ఉంది. మీ గమ్యస్థానాన్ని సెట్ చేయండి. చేరిన తర్వాత ఆటోమేటిక్‌గా షేరింగ్ ఆగిపోతుంది. మాన్యువల్ ఆఫ్ అవసరం లేదు. ఇది బ్యాటరీ, ప్రైవసీని ఆదా చేస్తుంది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయమా?
అరట్టైలో భారతీయత, బలమైన సెక్యూరిటీ ఉన్నాయి. ఈజీ డిజైన్ కొత్త యూజర్లను ఆకర్షిస్తుంది. ప్రభుత్వ మద్దతు విశ్వసనీయతను ఇస్తుంది. కానీ వాట్సాప్‌కు భారీ యూజర్ బేస్ ఉంది. అరట్టైకి నిరంతర అప్‌డేట్స్, పెద్ద మార్కెటింగ్ అవసరం. యూజర్ అలవాట్లను మార్చడం సవాలు. స్పామ్-ఫ్రీ చాట్‌లు ఆకర్షిస్తాయి. జోహో సర్వర్ సామర్థ్యాన్ని ఇప్పటికే పెంచుతోంది. అరట్టై భారత చాట్ సీన్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడే ఉచితంగా డౌన్‌లోడ్ చేయండి.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!