BigTV English

Actor Darshan: దర్శన్‌కు మొత్తటి పరుపు ఇవ్వండి… కోర్టులో విచారణ

Actor Darshan: దర్శన్‌కు మొత్తటి పరుపు ఇవ్వండి… కోర్టులో విచారణ

Actor Darshan: దర్శన్ (Darshan)పరిచయం అవసరం లేని పేరు. ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ ఈయన చేసిన పని కారణంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈయన పేరు మారుమోగిపోయింది. కన్నడ సినీ నటి రేణుక స్వామి(Renuka Swami) హత్య కేసులో భాగంగా దర్శన్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న దర్శన్ కు ఇప్పటివరకు బెలు రాకపోవడంతో ఆయన అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోర్టు ఈయనకు మద్యం తన బెయిల్ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల తన బెయిల్ రద్దు చేయడంతో తిరిగి దర్శన్ జైలుకు వెళ్లారు.


ఉగ్రవాదుల సెల్ లో దర్శన్..

ఇక జైలులో తనకు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవని జైలులో తనకు నరకం చూపిస్తున్నారు కనీసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి అంటూ ఈయన గతంలో కోర్టును అభ్యర్థించారు. జైలులో టార్చర్ తాను భరించలేకపోతున్నారని , దానికంటే కాస్త విషం ఇవ్వండి అంటూ గతంలో కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి దర్శన్ తరుపు లాయర్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దర్శన్ జైలులో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. తనని ఉగ్రవాదులను ఉంచే సెల్ లో బంధించారని, ఒంటరిగా తనకు నరకం చూపిస్తున్నారని దర్శన్ తరపు లాయర్లు తెలిపారు.

పరుపు, దిండు కావాలి..

దర్శన్ కు జైలులో కనీసం పరుపు దిండు కూడా లేదని ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇతరులు ఉపయోగించిన పరుపు దర్శన్ వాడినందుకు ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు అంటూ ఈయన తరుపు లాయర్లు సివిల్ కోర్టులో తమ వాదనలను వినిపించారు వెంటనే దర్శన్ కు మెత్తటి పరుపు తిండు సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక ఈ విషయంలో న్యాయస్థానం ఇరువురు వాదనలను విన్న అనంతరం ఈ విచారణని అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇలా దర్శన్ జైలులో ఉన్నప్పటికీ తనకు విఐపి ట్రీట్మెంట్ కావాలి అంటూ లాయర్లు పిటీషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో పలువురు విమర్శలు చేస్తున్నారు.


దర్శన్ కు విముక్తి ఎప్పుడు?

రేణుక స్వామి దర్శన్ కు సంబంధించిన నటి పవిత్ర గౌడకు అభ్యంతరకరమైన మెసేజ్ లు పంపిన కారణంగా పవిత్ర , దర్శన్ మరికొందరు కలిసి రేణుక స్వామిని దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో ఈ హత్య కేసులో భాగంగా దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఈయన గత ఏడాది జూన్ 11వ తేదీ అరెస్టు అయ్యారు నాలుగు నెలల తర్వాత ఆయన అనారోగ్య సమస్యల బారిన పడటంతో ఆయనకు కోర్టు బెయిల్ ప్రకటించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఈ బెయిల్ రద్దు చేయడంతో దర్శన్ తిరిగి జైలుకు వెళ్లారు. మరి ఈ హత్య కేసులో భాగంగా దర్శన్ ఎప్పుడు జైలు నుంచి విముక్తి పొందుతారో తెలియాల్సి ఉంది.

Also Read: OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

Related News

Srinidhi Shetty : చిన్న ఏజ్ లోనే అమ్మ చనిపోయింది, శ్రీనిధి కనిపించే నవ్వుల వెనక కన్నీటి గాథ 

Actress Hema: ఇంద్రకీలాద్రిపై కన్నీళ్లు పెట్టుకున్న హేమ… చేయని తప్పుకి బలి అంటూ

Chiranjeevi: మెగా 158 లో ప్రభాస్ హీరోయిన్.. బాబీ ఎంపిక సరైనదేనా?

Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

OG success Meet : స్టార్ హోటల్ లో ఓజి సక్సెస్ ఈవెంట్, 12 ఏళ్ల తర్వాత ఆ మూమెంట్ 

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

Big Stories

×