OTT Movie : బ్లాక్ బస్టర్ కొరియన్ వెబ్ సిరీస్ ‘ స్క్విడ్ గేమ్ ‘ మూడు సీజన్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మూడు సీజన్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ ఆధారంగా రూపొందించబడిన రియాలిటీ షో “స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ 2” మిమ్మల్ని అలరించడానికి నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది. ఈ సిరీస్ ద్వారా, 456 మంది ఆటగాళ్ళు మరోసారి సుమారు 40 కోట్ల రూపాయల బహుమతి కోసం పోటీ పడుతున్నారు. ఈ విధంగా ప్రేక్షకులకు మరోసారి ఆ రక్తపాత ఆటను చూసే అవకాశం లభిస్తోంది. ఈ షో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకుందాం.
‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ 2’ (Squid Game: The Challenge Season 2) నవంబర్ 4న 1 నుండి 4 ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి. 5 నుండి 8 ఎపిసోడ్‌లు నవంబర్ 11న విడుదల కానున్నాయి. చివరిగా 9 వ ఎపిసోడ్ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. “స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ 2” కోసం నిర్మాతలు ఇప్పటికే టీజర్‌ను విడుదల చేశారు. దీంతో ప్రేక్షకులలో ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని తెప్పిస్తోంది. ఈ సీజన్ లో అనేక మంది ప్రసిద్ధ పోటీదారులు ఈ బ్లడీ గేమ్‌లో పాల్గొంటారు. సీజన్ 1లో $4.56 మిలియన్లను, విన్నర్ మయా విజయం సాధించింది. ఇప్పుడు కొత్త విన్నర్ ఎవరు అని ఎక్సైట్‌మెంట్ అందరిలోనూ కలుగుతోంది.
ఇక్కడికి వచ్చిన 456 రియల్ ప్లేయర్స్, రక రకాల బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు. వీళ్ళల్లో టీచర్స్, బిజినెస్‌మెన్, స్టూడెంట్స్, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇందులో క్రిషెల్ స్టౌస్, చెల్సియా లాజ్కాని, బ్రె టైస్, ఎమ్మా హెర్నాన్, రొమైన్ బోనెట్, మేరీ బోనెట్, అలానా గౌల్డ్, అమాంజా స్మిత్, సాండ్రా వెర్గారా, నికోల్ యంగ్ జాసన్ ఒపెన్‌హీమ్ వంటి స్టార్లు కూడా కనిపిస్తారు. ఇది Red Light Green Light, Dalgona Candy, Tug of War, Glass Bridge వంటి ఆటలలో ఒడిన వాళ్ళు ఎలిమినేట్ అవుతుంటారు. ఫైనల్ విన్నర్ కు $4.56 మిలియన్ (సుమారు 40 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ అందుతుంది. ఈ సీజన్ సీజన్ 2 హైప్‌తో వస్తోంది – కొత్త గేమ్స్, షాకింగ్ ట్విస్ట్స్, మరింత ఇంటెన్స్ తో ఉండబోతోంది. ఈ ట్రైలర్ ని చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సిరీస్ ఎంత ఎక్సైట్‌మెంట్ ఇస్తుందో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.