Ramcharan -Upasana: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కుటుంబం గురించి తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంటుంది. మెగా హీరోల సినిమా గురించి లేదా వారి వ్యక్తిగత విషయాల గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా మరొక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది . మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్(Ramcharan) ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
రామ్ చరణ్ సినిమాలు పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఉపాసనని(Upasana) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .ఇక ఈ దంపతులకు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు అమ్మాయి జన్మించింది. ఈ చిన్నారికి క్లిన్ కారా (Klinkaara) అని నామకరణం చేశారు. అయితే ఈ చిన్నారి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే తాజాగా మెగా ఇంట్లో మరొక వారసుడు రాబోతున్నారు అంటూ ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ(Second Pregnancy)కి సంబంధించి వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఇలా ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై మెగా కుటుంబం ఎక్కడ స్పందించలేదు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి మెగా కుటుంబం అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన చెయ్యి పట్టుకొని తనని జాగ్రత్తగా తీసుకెళుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరింది. అలాగే ఉపాసన తన బేబీ బంప్ (Baby Bump)కనిపించకుండా జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో ఈమె తల్లి కాబోతుందని కానీ ఈ విషయాన్ని వెల్లడించడం లేదని అభిమానులు భావిస్తున్నారు.
మనవడి కోసం చిరు ఎదురుచూపులు..
ఇక ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఈసారి కచ్చితంగా అబ్బాయే జన్మిస్తారని మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కూడా మనవడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా చిరంజీవి చరణ్ తో నాకు మనవడు కావాలి అని అడిగినట్లు ఒక కార్యక్రమంలో తెలియజేశారు. ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇక రాంచరణ్ ఉపాసనలకు కూడా కొడుకు పుడితే ఇండస్ట్రీలో మెగా లెగసీ కంటిన్యూ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
Also Read: Rashmika: ప్రేమ అంటే కంట్రోల్ చేయటం కాదు.. గౌరవించడం రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!