BigTV English

Sadar Festival: సదర్ దున్నపోతుకు కాస్ట్లీ మద్యం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Sadar Festival: సదర్ దున్నపోతుకు కాస్ట్లీ మద్యం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Advertisement

Sadar Bull Fed Rs 31000 Royal Salute Whisky:

హైదరాబాద్ లో దీపావళి పండుగ సందర్భంగా యాదవులు సదర్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఖరీదైన దున్నపోతులు చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న యాదవులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేస్తారు. సిటీలోని పలు ప్రదేశాల్లో ఈ వేడులను ధూంధాంగా జరుపుతారు. అద్భుతంగా అలంకరించిన దున్నపోతులను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. దున్నపోతులతో కుస్తీలు పడుతూ అలరిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే దున్నపోతులు కూడా లక్షల విలువ చేసేవి ఉంటాయి. వీటిని చక్కటి ఆహారంతో కంటికిరెప్పలా పెంచుతారు.


దున్నపోతుకు 21 ఏళ్ల నాటి మద్యం తాగించిన మధు యాదవ్

ఈ ఏడాది దీపావళి ఉత్సవాల్లో భాగంగా ముషీరాబాద్‌ లో సదర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా  వస్తాద్ గుమాన్ కాళీకి చెందిన మధు యాదవ్ దున్నపోతు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏకంగా 2500 కేజీల బరువున్న ఈ దున్నపోతు అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకల సందర్భంగా దున్నపోతుకు మధుయాదవ్‌ రూ. 31 వేల విలువ చేసే 21 ఏళ్ల నాటి రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ను తాగించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దున్నపోతు విస్కీకే అంత డబ్బు ఖర్చు చేస్తే, దాన్ని ఏడాదంతా పెంచేందుకు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాడోనని అందరూ చర్చించుకున్నారు.

Read Also: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!


అసలు ట్విస్ట్ ఏంటంటే?

మరో వైపు ఈ వైరల్ వీడియోలపై పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. పశువులకు మద్యం తాగించడం ఇల్లీగల్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ మొదలు పెట్టారు. మరోవైపు జంతు ప్రేమికులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అయితే, సదర్ నిర్వాహకులు పోలీసులు విచారణపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Read Also: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Related News

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Foreign Tourist Trolled: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Non-venomous Snake: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Big Stories

×