Akhil -Zainab: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి (Diwali)పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కినేని వారసుడు అఖిల్(Akhil) సైతం తన భార్య జైనాబ్ (Zainab) కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖిల్ జైనాబ్ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో భాగంగా అఖిల్ జైనాబ్ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని జైనాబ్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది. అఖిల్ జైనాబ్ వివాహం తర్వాత వీరికి సంబంధించిన ఫోటోలు ఏవి బయటకు రాలేదు కానీ మొదటిసారి దీపావళి పండుగ సందర్భంగా ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు కూడా వీరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అఖిల్ జైనాబ్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అఖిల్ వివాహపు వేడుకలు అతి కొంతమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక పెళ్లి తర్వాత అఖిల్ పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించలేదు ఈయన తన సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం లెనిన్(Lenin) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తుంది.
ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా భాగ్యశ్రీ(Bhagya Shri) హీరోయిన్ గా నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం చిత్ర బృందం వెల్లడించలేదు. అఖిల్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇలా ఒక్క హిట్ కూడా పడని నేపథ్యంలో అభిమానులు కూడా లెనిన్ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి లెనిన్ సినిమా అయిన అయ్యగారికి సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చివరిగా అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది.
Also Read: Ramcharan -Upasana: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా కపుల్స్.. వారసుడొస్తున్నాడా?