BigTV English

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?
Advertisement

OTT Movie : ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్న నటించిన ‘థామా’ సినిమాకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమా టీజర్‌ను ఆగష్టు 19న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేయగా, ఈ సినిమాను అక్టోబర్ 21న విడుదల చేశారు. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. అప్పుడే దీని ఓటీటీ రైట్స్ కూడా హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ప్రైమ్ వీడియో దీనిని భారీ ధరకే కొనుగోలు చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించనున్నారు. ఈ చిత్రం థియేటర్లలో సంచలనాన్ని సృష్టిస్తుండటంతో ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. మీరు థియేటర్లలో ‘థమా’ సినిమా చూడాలనుకుంటే , ముందుగా ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ చిత్రాలను తప్పకుండా చూడాలి. ఓటీటీలో ఉన్న ఆయుష్మాన్ ఉత్తమ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.


‘అంధాధున్’ (Andhadhun)

డార్క్ కామెడీ శైలిలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా 2018లో విడుదలై, ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లో అత్యుత్తమమైన చిత్రంగా నిలిచింది. దీని సస్పెన్స్ మిమ్మల్ని చివరి వరకు కుర్చీలకి కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో టబు, రాధికా ఆప్టే కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘బదాయి హో’ (Badhaai Ho)

ఇది ఒక డిఫరెంట్ కథ. దీనిలో ఒక లేటు వయసులో ఒక మహిళ గర్భవతి అవుతుంది. ఆమెకు యుక్త వయసు ఉన్న కొడుకు ( ఆయుష్మాన్ ఖురానా ) కూడా ఉంటాడు. దీంతో మొత్తం కుటుంబానికి ఈ ప్రెగ్నెన్సీ ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సినిమా చివరి వరకు ఆసక్తికరంగా నడుస్తుంది. కామెడీ సినిమాలను ఇష్ట పడే వాళ్ళకి ఇది బెస్ట్ సజెషన్. జియో హాట్‌స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


ఆన్ యాక్షన్ హీరో (An Action Hero)

ఈ సినిమా ఒక బాలీవుడ్ యాక్షన్ హీరో (ఆయుష్మాన్ ఖురానా), ఒక ప్రమాదం కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అతను ఒక రాజకీయ వ్యక్తి తో ప్రమాదకరమైన గేమ్ మొదలుపెడతాడు. ఈ సినిమా ఆడియన్స్ కి, ఒక ఉత్కంఠభరితమైన రోలర్ కోస్టర్ రైడ్ న్ ఇస్తుంది. 2022 లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఆర్టికల్ 15 (Article 15)

ఆయుష్మాన్ “ఆర్టికల్ 15″లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇది వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. కుల వివక్ష కి ఆజ్యం పోసిన గ్రామీణ ప్రాంతంలో, నేరాలను పరిష్కరించే పోలీసు అధికారిగా ఆయన నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆయుష్మాన్ ఖురానా తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు ‘థామా’ సినిమాతో, అతను మరోసారి రక్త పిశాచిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తిరిగి వచ్చాడు.

Read Also : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

 

 

Related News

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : 456 మంది ఆటగాళ్ళు…. 40 కోట్ల నజరానా… ఇండియాలో ‘స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Movie : 300 కోట్ల దోపిడీ… బిగ్గెస్ట్ రియల్ లైఫ్ దొంగతనం… ‘మనీ హీస్ట్’లాంటి కేక పెట్టించే థ్రిల్లర్

Vash level 2: ఓటీటీలోకి వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

Big Stories

×