APSRTC Apprenticeship: ఏపీఎస్ఆర్టీసీలో 277 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల్లో వివిధ విభాగాల్లో 277 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో అక్టోబరు 25వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ ట్రేడ్స్ లో ఖాళీలు ఉన్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
1. కర్నూలు- 46
2. నంద్యాల- 43
3. అనంతపురం- 50
4. శ్రీ సత్యసాయి- 34
5. కడప- 60
6. అన్నమయ్య- 44
మొత్తం ఖాళీలు : 277
ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వైబ్ సైట్ లో ముందుగా నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్ లో లాగిన్ అయ్యి జిల్లా ఎంచుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో కర్నూలు, బళ్లారి చౌరస్తా, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కాలేజీలో వెరిఫికేషన్ కు హాజరుకావాలి. వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు రూ.118 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ తేదీలను త్వరలో తెలియజేయనున్నారు.
విద్యార్హతలో మెరిట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ వెరిఫికేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.