BigTV English

Palnadu Politics: పల్నాడు నెత్తుటి కథ.. తప్పెవరిది?

Palnadu Politics: పల్నాడు నెత్తుటి కథ.. తప్పెవరిది?
Advertisement

Palnadu Politics: హత్యలు.. ప్రతీకార హత్యలు దాడులు ప్రతి దాడులు లతో అట్టుడికి పోయిన పల్నాడు.. గత రెండు దశాబ్దాల కాలంగా ప్రశాంతంగా ఉంది. మళ్లీ పల్నాడులో ఫ్యాక్షనిజం రాజ్యమేలుతోంది. రాజకీయ పార్టీల తమ స్వార్థం కోసం పల్నాడులో శవ రాజకీయాలకి వేదిక చేస్తున్నారు.


గత దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న నరసరావుపేట స్వర్గపురిలో జరిగిన మర్డర్.. రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. స్వర్గపురిలో జరిగిన ఎఫ్రాం హత్యను కక్ష సాధింపుగా చర్యగా టిడిపి అభివర్ణిస్తుంది. చనిపోయిన ఎఫ్రాన్ గత ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇచ్చాడని వైసిపి కుట్రపన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ మర్డర్ చేపించాడని టిడిపి ప్రధాన ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో నే హత్య జరిగిందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌ బాబు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎఫ్రాన్ టిడిపికి మద్దతు ఇచ్చాడని హత్య చేశారని.. వైసీపీకి చెందిన ఖాదర్ అతని బంధువులే హత్యలో కీలక నిందితులుగా ఉన్నారంటున్నారు ఎమ్మెల్యే.

గత వైసిపి హాయాంలోనే నరసరావుపేటలో ఎన్నో హత్యలు జరిగాయి.ఎఫ్రాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబుని.. హోమం అనిత అని టిడిపి ఎమ్మెల్యే కోరుతున్నారు.ఈ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఎమ్మెల్యే అరవింద్‌ బాబు తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవ రూపంలో ఉన్న మృగమంటూ సంచలన కామెంట్స్ చేశారు. వివేకానంద రెడ్డిని చంపిన విధంగానే ఎఫ్రాన్ ను గొడ్డలితో నరికి చంపారో ఆ విధంగానే ఎఫ్రాంను హతమార్చారని మండిపడ్డారు. ఎఫ్రాన్ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కలిసి ఎమ్మెల్యే కోరారు.


ఎఫ్రాం మర్డర్ కు మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వైసిపి ముఖ్య నాయకులను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. మీ టిడిపి వాళ్ళు చేసిన మర్డర్లకు మాకు సంబంధం ఏంటి మీరు చేసిన మర్డర్లను కప్పిపుచ్చుకొని కేసు దర్యాప్తులను తప్పుదోవ పట్టించడానికి మీరు ఆడుతున్న కొత్త నాటకమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. హత్యకు గల కారణం ఖాదర్ వాళ్ల తమ్ముడని టిడిపి ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాదర్ ని స్టేషన్ కి పిలిపించి ఏ కారణం లేకుండా కొట్టించరాని, ఖాదర్ వైసీపీ పార్టీకి క్రియాశీలంగా ఉంటాడని అక్కసుతో ఎమ్మెల్యే ఈ హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని వైసిపి ఆరోపణ..అతన్ని హత్య చేయడానికి మాకేం పని, అతను ఒక టీడీపీకి ప్రధాన నాయకుడా లేక వార్డులో బలమైన కార్యకర్తా..టిడిపి హత్యలకు మేమే కారణమని చెప్తున్నావు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది హత్యలకు గల కారణం ఎవరు అని కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ వేపించవచ్చు కదా అని వైసీపీ నేతలు ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నారు.

ఎఫ్రాన్ హత్యకు సంబంధించి టిడిపి వైసిపి ఒకరిపై ఒకరు ఆరోపణలు .. ప్రత్యారోపణలు చేసుకోవడంతో నరసరరావుపేటలో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న డెలాగ్ వార్‌తో మరోసారి పల్నాడు పాలిటిక్స్‌ రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, వైసీపీ నేతలు నాయకులు స్థానికంగా దాడులకు, అల్లర్లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ నేతలు,ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలపైనా వైసీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న పరిస్ధితి. ఎమ్మెల్యే అరవింద్‌బాబు వ్యక్తిగత వివాదాలతో తలదుర్చుతూ… అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తుంది వైసీపీ. రాజకీయంగా వైసీపీ,కార్యకర్తలను అణగదొక్కడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.

ఎఫ్రాన్ హత్యకు సంబంధించి ఓ మహిళా కి సంబంధించిన వివాదమే కారణమని మరొకవైపు పోలీసులు భావిస్తున్నారట. హత్య ఎందుకు జరిగింది జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి.. ఎందుకు రాజకీయ రంగు పులుముకుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చర్చ నడుస్తోందట. జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే హత్య జరగటం సంచలనం మారింది. నిందితులు ఎవరు అనే కోణంలో పోలీసులు విష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని స్థానికుల కోరుతున్నారు..

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇరు పార్టీలు కలిసి వారి స్వార్థం కోసం మరొకసారి ఫ్యాక్షన్ ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సామాన్య ప్రజలు అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ స్వార్థం వీడి అభివృద్ధి విధంగా చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు . పోలీసు దర్యాప్తు ఎలా కొనసాగుతుందో నిందితులెవరో తెలియాలంటే పోలీసులు నోరు పిస్పాల్సిందే.

Story By Apparao, Bigtv Live

Related News

Paritala Sriram vs Kethireddy: లైట్ తీసుకున్నారా ? కేతిరెడ్డిపై పరిటాల ప్లానేంటి?

Louvre Museum: ‘మనీ హీస్ట్’ సీరిస్ స్టైల్‌లో మ్యూజియంలో చోరీ.. జస్ట్ 7 నిమిషాల్లోనే పని కానిచ్చేసిన దొంగలు, ఇదిగో ఇలా!

Jubilee Hills By Election: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ గట్టెక్కుతుందా?

Google In Vizag: ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న వైజాగ్ ఏఐ హబ్‌.. మరి ఉద్యోగాలు?

Bulk Drug Park: బల్క్ డ్రగ్ పార్క్.. పార్టీల స్టాండ్ ఏంటి?

YS Jagan: నరసాపురంలో పడకేసిన వైసీపీ.. పార్టీ కోసం జగన్ తిప్పలు

KCR: బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి కేసీఆర్ ?

Big Stories

×