OG Ticket Cost is 1 Lakh in AP: పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ఓజీ (OG Movie) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కి సిద్దమౌవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్ మూవీపై విపరీతమైన బజ్ పెంచాయి. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్, బజ్ చూస్తుంటే మూవీ టీంలో ఆందోళన నెలకొంది. మూవీకి అంచాలను మంచి హైప్ ఉన్న కష్టమే.. అందుకే ట్రైలర్ని సాధాసిదాగా కట్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓవర్ హైప్ వల్ల మూవీకి నష్టమే.. కాబట్టి మూవీ టీం ముందు జాగ్రత్తగా పడుతోందట.
ఇప్పటికే ఓజీ అడ్వాన్డ్స్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే అక్కడ రెండు మిలియన్లకు పైగా ప్రీ సేల్ జరిగినట్టు తెలుస్తోంది. ఓవర్సిస్ ఓజీ తొలి టికెట్ రూ. 5 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. అక్కడ మూవీ టికెట్ వేలం వేయగా.. పవన్ అభిమాన సంఘటం ఈ టికెట్ని సొంతం చేసుకుంది. ఒక సినిమా టికెట్ ధర రూ. 5 లక్షలకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఆ ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే దక్కింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓజీ అడ్వాన్డ్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఇక ఏపీ జోరుగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్లో ఓజీ మొదటి టికెట్ లక్ష రూపాయలకు అమ్ముడుపోయిందట. ఈ టికెట్ పవన్ అభిమాని కొనుగోలు చేశారు. ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని రూ. లక్షతో తొలి టికెట్ కొన్నాడు. ఈ డబ్బులను తమ జిల్లా అభివ్రద్ది కోసం ఉపయోగించాలని ఆయన మూవీ టీంని కోరాడట. టికెట్ కొన్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు టికెట్ కోసం అతడు ఇచ్చి చెక్ కూడా వైరల్ అవుతుంది. కాగా ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు.
Also Read: Deepika Padukone : కల్కిలో ప్రభాస్ జోకర్… దీపిక ఆ సీన్ చేసింది కాబట్టే బ్లాక్ బస్టర్
గ్యాంబ్లింగ్ వదిలేసిన మళ్లీ.. గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు అనేది ఈ కథ. యాక్షన్ డ్రాగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్గా నటించాడు. తెలుగులో అతడికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో ఓమీ అనే విలన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్లో ఇతడి లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా చెప్పలంటే హీరో కంటే అతడి ఎలివేషనే ఎక్కువగా కనిపించింది. మరి టైలర్లో ఓమి ఎలివేషన్ ఏ రేంజ్లో ఉందో చూడాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్తో పాటు సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.