Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు రంగాలలో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి.. ఏపీలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో అదరగొట్టేసింది. ఇక టీడీపీ , బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంగా చంద్రబాబు (Chandrababu) డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి కీలక పదవి అప్పగించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో విశ్వనటుడు కమల్ హాసన్ కి కంగ్రాట్స్ తెలుపుతూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు.మరి ఇంతకీ కమల్ హాసన్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు కంగ్రాట్స్ చెప్పారు? కమల్ హాసన్ సాధించిన ఆ ఘనత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కమల్ హాసన్ కి స్పెషల్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..
లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ (Kamal Haasan) నటుడిగా అందరికీ తెలిసిన పేరే..అయితే అలాంటి కమల్ హాసన్ తాజాగా ఆస్కార్ అవార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డులో చోటు సంపాదించుకోవడం అంటే ఆయన నటించిన సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్ళిందని అనుకుంటే పొరపడినట్లే.మరి ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కమల్ హాసన్ 2025 ఆస్కార్ అవార్డ్స్ కమిటీ మెంబర్ గా ఎంపికయ్యారు. అయితే ఇదే విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాలో కమల్ హాసన్ ని విష్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కమల్ హాసన్ కి ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేశారో ఇప్పుడు చూద్దాం.
ఆస్కార్ కమిటీ సభ్యుడిగా కమల్ హాసన్.. పవన్ పోస్ట్ వైరల్..
“నటుడిగా.. దర్శకుడిగా.. గాయకుడిగా.. నిర్మాతగా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా.. ఇండస్ట్రీలో దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.. ఆరు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కమల్ హాసన్ హీరో కంటే ఎక్కువ.. మీ ఆరు దశాబ్దాల అనుభవం భారతదేశంపై,ప్రపంచం పై ఎప్పటికి మర్చిపోలేని ప్రభావాన్ని చూపింది.. సినిమా నిర్మించడంలో కమల్ హాసన్ చూపే అసాధారణమైన పట్టు.. నిజంగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం.. 2025 అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) కమిటీ మెంబర్(2025 Academy Awards (Oscar) Committee Member) గా కమల్ హాసన్ గారు ఎన్నికైనందుకు నేను ఆయనకి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాలకు మీరు ఇంకా ఎన్నో ప్రభావవంతమైన సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను”. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ పై ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్లు, అభిమానులు కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:Shraddha Kapoor: నా నుండి నువ్వు తప్పించుకోలేవ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రద్ధా కపూర్ పోస్ట్!
It is a moment of immense pride to Indian film industry that Padma Bhushan Thiru @ikamalhaasan Avl has been selected as a member of the prestigious @TheAcademy Awards 2025 committee.
With a phenomenal acting career spanning six decades, Kamal Haasan garu is more than an actor.…
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2025