Lack Of Sleep: నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. మనం తరచుగా నిద్ర పోయే సమయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. పని ఒత్తిడి, మొబైల్ , ఇంటర్నెట్ , సామాజిక బాధ్యతల వల్ల సమయానికి తగినంత నిద్రపోవడం ఒక సవాలుగా మారింది. అంతే కాకుండా చాలా మంది తక్కువ నిద్ర సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి కనీసం 6 గంటలు నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
నిద్ర అనేది విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు.. మన శరీరం, మనస్సు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సహజ ప్రక్రియ. నిద్ర పూర్తి కానప్పుడు.. అది మన శక్తిని ప్రభావితం చేయడమే కాకుండా.. అనేక తీవ్రమైన వ్యాధులు, మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి.. మీరు రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. తప్పకుండా అలవాట్లను మార్చుకోండి.
రాత్రి 6 గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల కలిగే 5 నష్టాలు:
తగ్గిన శ్రద్ధ, జ్ఞాపకశక్తి:
మనకు తగినంత నిద్ర లేనప్పుడు మన మెదడు సరిగ్గా పనిచేయదు. ఇది మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా చదువుతో పాటు పనిలో తప్పులు చేయడం. ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం సాధారణ విషయం కావచ్చు.
గుండె జబ్బుల ప్రమాదం:
తరచుగా తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఒత్తిడి , నిరాశ:
నిద్ర లేకపోవడం వల్ల మన మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా నిరాశ వంటి మానసిక అనారోగ్యాలకు కూడా ఇది కారణమవుతుంది. ఇది మన మానసిక స్థితిని పాడు చేస్తుంది. దీనివల్ల మనం త్వరగా కోపానికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
ఊబకాయం, జీవక్రియపై ప్రభావం:
తక్కువ నిద్ర వల్ల.. మన శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. అంతే కాకుండా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. దీని వల్ల కేలరీలు బర్న్ చేసే ప్రక్రియ తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి బలహీనపడటం:
మనకు తగినంత నిద్ర లేనప్పుడు.. మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా మనం వ్యాధులకు గురవుతాము. సరైన నిద్ర పొందడం వల్ల శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల నీరసంగా, బలహీనంగా కూడా అనిపిస్తుంది.
Also Read: బెస్ట్ ఆయిల్, ఇది వాడితే.. జన్మలో జుట్టు రాలదు
రాత్రిపూట కనీసం 6 గంటలు నిద్రపోవడం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు.. మన మొత్తం ఆరోగ్యానికి కూడా ఇది ముఖ్యం. మంచి నిద్ర మన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోండి. అంతే కాకుండా స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. నిద్ర సమయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.