BigTV English
Advertisement

OG Collections: పవన్ కళ్యాణ్‌‌ కెరీర్‌లో ఫస్ట్ టైం… కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఓజీ

OG Collections: పవన్ కళ్యాణ్‌‌ కెరీర్‌లో ఫస్ట్ టైం… కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఓజీ

OG Collections:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఓజీ (OG). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. అయితే సినిమా ప్రేక్షకులు మాత్రం ఒకసారి చూడవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్ దగ్గరుండి మరీ చూసుకున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రేయ రెడ్డి, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


ఓజీ మూవీ కలెక్షన్స్..

ఇక ఎవరికివారు తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసారని చెప్పాలి. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 24వ తేదీనే ప్రీమియర్ షోలు పడగా.. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఓజీ సినిమా ప్రీమియర్స్ తో కలిపి ఎన్ని కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఓజీ ప్రీమియర్ కలెక్షన్స్ విషయానికి వస్తే..


రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.24 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్ లో రూ.16 కోట్లు కలెక్ట్ చేసింది.

ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్..

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా రూ.72 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. ఓవర్సీస్ లో రూ.7 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. తమిళనాడులో రూ.30 లక్షలు, కన్నడలో రూ.27 లక్షలు, హిందీలో రూ.40లక్షల వరకు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఓజీ. ఓవరాల్ గా ఈ సినిమాకి రూ.135 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే కూలీ, లియో, జవాన్, యానిమల్ చిత్రాలను కూడా మొదటి రోజు అధిగమించింది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి రోజు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

ALSO READ:OG Movie: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

ఓజీ సినిమా విశేషాలు..

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర హైలెట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాను థియేటర్ రన్ ముగిసేసరికి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజీత్ తెలిపారు..

Related News

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

SSMB29: పాట వింటుంటే టైటిల్ అదే అనిపిస్తుంది, వారణాశి నా లేక సంచారి నా?

Mowgli: సందీప్ రాజ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం, అసలు కారణం ఏంటి?

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

Big Stories

×