Solo Boy Pre-release: సోలో బాయ్(Solo Boy) బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుకుంటే మన డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండోయ్.. పవన్ కళ్యాణ్ డూప్.. జూనియర్ పవన్ కళ్యాణ్ హాజరై సందడి చేశారు.
లో బడ్జెట్ సినిమాలు..
సాధారణంగా ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే ఆ సినిమా పై మంచి అభిప్రాయం ఉండటానికి పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా పిలుస్తూ ఉంటారు. అయితే సోలో బాయ్ సినిమా లోబడ్జెట్ మూవీ కావడంతో పవన్ కళ్యాణ్ ని కాకపోయినా, ఆయన డూప్ ను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇక ఈ వేదికపై పవన్ డూప్ చేసిన హడావిడి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అచ్చం పవన్ కళ్యాణ్ తరహాలోనే ఈయన కూడా సందడి చేయడంతో అభిమానులు కూడా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
సోలో బాయ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్…
ఈ కార్యక్రమంలో ఈయన పవన్ కళ్యాణ్ లాగే కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పవన్ డూప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందుగా తనను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గౌతమ్ నటన గురించి కూడా మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు . గౌతమ్ ఫస్ట్ సినిమా ఆకాశ వీధుల్లో సినిమా వేడుకకు కూడా తనని ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాని తాను చూసానని చాలా అద్భుతంగా ఉందని ప్రశంసల కురిపించారు. గౌతమ్ ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ను ఇలా కూడా వాడుతున్నారా?
ఇక ఈ సినిమా ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ డూప్ ఈ సందర్భంగా సోలో బాయ్ సినిమా టీంకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం చివరిలో ఈయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన డైలాగ్ చెప్పి అందరిని సంతోష పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ ను చూసిన భావన కలుగుతుంది అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇలా కూడా వాడుకుంటున్నారా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కుర్రాడు..
ఇక సోలో బాయ్ సినిమా విషయానికి వస్తే… బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి సక్సెస్ అందుకున్న గౌతం కృష్ణకు ఇది రెండవ సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమాలో గౌతమ్ సరసన రమ్య పసుపులేటి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కుర్రాడు జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం ఎలా కష్టపడ్డారు, ఆ సక్సెస్ సాధించడం వెనుక ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారనే నేపథ్యంలో సినిమా రాబోతుందని ఇదివరకు విడుదల చేసిన ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి సోలో బాయ్ గా రాబోతున్న గౌతమ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా భావిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్‌లోకి AI కంటెంస్టెంట్ ఎంట్రీ.. ఇంతకీ ఎవరీ హబుబూ?