BigTV English

Bigg Boss 19: బిగ్ బాస్‌లోకి AI కంటెంస్టెంట్ ఎంట్రీ.. ఇంతకీ ఎవరీ హబుబూ?

Bigg Boss 19: బిగ్ బాస్‌లోకి AI కంటెంస్టెంట్ ఎంట్రీ.. ఇంతకీ ఎవరీ హబుబూ?

Bigg Boss 19: బిగ్ బాస్ (Bigg Boss)ఈ పేరు వింటేనే ప్రేక్షకులకు ఎంతో తెలియని ఆనందం వస్తుంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సక్సెస్ అవుతూ దూసుకుపోతుంది. తెలుగులో ఈ కార్యక్రమం 9వ సీజన్ ప్రారంభం కాబోతుండగా, హిందీలో ఏకంగా 19వ సీజన్ ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఈ కార్యక్రమం హిందీలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.. మరి కొద్ది రోజులలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన మొదటి ప్రోమో షూట్ చేయబోతున్నారని సమాచారం.


బిగ్ బాస్ షోలో కృత్రిమ కంటెస్టెంట్..

ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 19 గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ బిగ్ బాస్ సీజన్-19 ఒక కృత్రిమ కంటెస్టెంట్ పాల్గొనబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. ఏఐ టెక్నాలజీ(AI Technology)తో రూపొందించిన కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కృత్రిమ కంటెస్టెంట్ ఎవరు? అసలు మేటర్ ఏంటి అనే విషయానికి వస్తే…


బిగ్ బాస్ లోకి హబుబూ..

UAE రూపొదించిన మొట్టమొదటి ఏఐ బొమ్మ పేరే హబుబూ(AI Doll Habubu). అయితే ఈ హబుబూ బొమ్మ బిగ్ బాస్ 19 కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తెలియచేశారు. “ఇండియాలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాను.. ఇక నిర్వాహకులు కూడా దీనికి ఒప్పుకునే వరకు మనం ఎదురు చూడాల్సిందే” అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఏఐ కంటెస్టెంట్ రాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

AI బొమ్మలతోనే బిగ్ బాస్…

UAE రూపొదించిన ఈ హబుబూ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. పెద్ద పెద్దని జింక కళ్ళు, దాని బంగారు ముసుగు సిగ్నేచర్ బ్లాక్ హిజాబ్‌కు ప్రసిద్ధి. ఈ బొమ్మ హిందీతో పాటు ఏకంగా ఏడు భాషలు మాట్లాడగలదని తెలుస్తోంది. ఇలా ఎంతో ఆసక్తికరమైన ఏఐ బొమ్మ బిగ్ బాస్ కార్యక్రమంలోకి ప్రవేశిస్తే కనుక మరింత ఆసక్తికరంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పాలి. ఇలా ఈ కార్యక్రమంలో హబుబూ పాల్గొని ఇది కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరుగుతాయని చెప్పాలి. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఏఐ కంటెస్టెంట్లతోనే సరికొత్త సీజన్ ప్రారంభానికి కూడా బీజం పడుతుందని చెప్పాలి. మరి హిందీ బిగ్ బాస్ 19 లో హబుబూ పాల్గొంటున్నారనే వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు తప్పనిసరిగా ఎదురు చూడాల్సిందే.

Also Read: భారీ ధరకు SSMB29 ఓటీటీ రైట్స్… ఎందులో.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Big Stories

×