BigTV English

Telangana Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డులు.. ఆ రోజే పంపిణీ.. లిస్టులో పేరు చెక్ చేసుకోండి

Telangana Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డులు.. ఆ రోజే పంపిణీ.. లిస్టులో పేరు చెక్ చేసుకోండి

Telangana  Ration Card: తెలంగాణలో పేదలకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. దశాబ్దం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న చల్లటి కబురు చెప్పింది. దాదాపు రెండున్నరల లక్షల కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపింది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షలకు పైగానే ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.


సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల పంపిణీని తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే రోజు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వం.

పౌరసరఫరాల శాఖ ఆమోదించిన లబ్ధిదారుల గణాంకాలను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. కేవలం కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చారు. దీంతో భారీ సంఖ్యలో పేదలు లబ్ధిదారులుగా మారనున్నారు. రేషన్ కార్డు దరఖాస్తులను దశలవారీగా పరిశీలించి ఆమోదిస్తోంది ప్రభుత్వం.


కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆమోదించిన తర్వాత డైనమిక్ కీ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. అప్పుడు లబ్ధిదారులను రేషన్ పథకంలో చేర్చనున్నారు. తొలుత క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే టెండర్ల ప్రక్రియలో ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ప్రాసెస్ కాస్త డిలే అయ్యింది.

ALSO READ: ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టుకోండి.. ప్రత్యర్థులకు చెమటలు

ప్రస్తుతానికి పేపర్ రూపంలో రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. కొత్త రేషన్ కార్డు తమకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. తొలుత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

https://epds.telangana.gov.in. హోమ్ పేజీలో ఎడమ వైపు ఆప్షన్లలో ఎఫ్ఎస్సీ FSC Search పై క్లిక్ చేయాలి. FSC Application Search అనే ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. తొలుత మీ జిల్లాను ఎంచుకోవాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ-సేవా కేంద్రం ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

చివరగా Search బటన్‌పై క్లిక్ సరిపోతుంది. వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ కింద డిస్‌ప్లే కానుంది. మీ దరఖాస్తు Approved అయినట్టు ఉంటే రేషన్ కార్డు వచ్చినట్లే. మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ ఆధార్ నంబర్ చెప్పి రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.

Related News

Govt savings plan: మీ పాప పేరు మీద ఈ స్కీమ్‌లో ఇంత పెట్టుబడి పెడితే.. పెళ్లికి సుమారు రూ.72 లక్షలు మీ చేతికి!

TG High Court: రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్.. నివేదక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై పిటిషన్.. కోర్టులో వాడివేడి వాదనలు, తీర్పు ఎటు?

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌కు కిషన్‌‌రెడ్డి ఝలక్.. బీఆర్ఎస్ మద్దతు నో, షాకైన బీఆర్ఎస్

MLC Kavitha: కవితకు షాకిచ్చిన బీఆర్ఎస్.. ఆ పదవి నుంచి తొలగింపు, లేఖ విడుదల

Hyderabad Land: ఎకరం భూమి రూ.70 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డు

Big Stories

×