Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్ చిత్ర యూనిట్ చాలా గట్టిగా చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ చేయడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది.
దాదాపు 5 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సినిమా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మొత్తానికి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలుపెట్టారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్
పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా చేయరు అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం సినిమాకి సంబంధించిన ఈవెంట్ కు మాత్రమే హాజరవుతారు. కానీ ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంచెం ముందు అడుగు వేశారు. ప్రతిచోట ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక కొత్త ప్లాన్ వేశారు. మామూలుగా చాలామంది సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటే ఒకే చోట కూర్చుని పలు రకాల చానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. అవే కాస్ట్యూమ్స్ తో చాలా చోట్ల ఇంటర్వ్యూ కనిపిస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కో ఛానల్ కి ఒక్కో షర్ట్ మార్చారు. ప్రతి ఇంటర్వ్యూ చూస్తుంటే ఇది కొత్తగా ఇచ్చారు అనే ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి ఈ సినిమా కోసం వర్క్ అవుట్ చేసిన ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
జెట్ స్పీడ్ లో బుకింగ్స్
ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఏ మాత్రం బజ్ లేదు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో మొత్తం లెక్కలు మారిపోయాయి. ఈ సినిమాని కొనడానికి ఒక తరుణంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు రాలేదు. ఏం రత్నం కూడా రేటు విషయంలో వెనక్కి తగ్గలేదు. సినిమాను కూడా అలానే ప్రమోట్ చేస్తూ వచ్చాడు నిర్మాత రత్నం. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ప్రస్తుతం ఆన్లైన్ లో పెట్టారు. బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో ఉన్నాయి. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన వెంటనే విపరీతంగా సేల్ అవుతున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
Also Read: Pawan Kalyan : ఇది పవన్ కళ్యాణ్ రేంజ్, మరోసారి ప్రూవ్ అయింది