HHVM Bookings : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా అయిపోవడం వల్ల సినిమాల మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. కానీ ఒకప్పుడు కేవలం సినిమాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం. అప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే నెలరోజుల ముందు నుంచే ఒక పండగ వాతావరణం నెలకొనేది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమాకి మొన్నటి వరకు పెద్దగా బజ్ కూడా లేదు. కేవలం నిర్మాత మాత్రమే ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. ప్రతి ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం భారీ ఎలివేషన్ ఇచ్చాడు. అసలు ఈ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ముందుకు రావట్లేదు అనే వార్తలు కూడా వినిపించాయి. ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో నిధి అగర్వాల్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేసింది.
ఇది పవన్ కళ్యాణ్ రేంజ్
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్ షో టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫీల్ అయిపోతున్నాయి. నాలుగు సంవత్సరాల నుంచి హోల్డ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు బుకింగ్స్ చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో ఇప్పుడు మరోసారి అర్థమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మారిపోయారు. అక్కడితో ఈ సినిమా మీద చాలామందికి నమ్మకాలు తగ్గిపోయాయి. ఈ సినిమా ఆగిపోతుంది అనే వార్తలు కూడా ఒక తరుణంలో వచ్చాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇన్ని మైనస్ పాయింట్లు ఈ సినిమాకి ఉన్న కూడా ఇప్పుడు బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని చాలామందికి ఈజీగా అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు
గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ప్రమోషన్ చేయరు. కేవలం సినిమా ఈవెంట్ కు మాత్రమే హాజరవుతారు. కానీ ఈ సినిమాకు విపరీతమైన ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలానే సినిమాకు సంబంధించి రెండు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎప్పుడూ లేనివిధంగా సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి పోస్ట్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ తన సినిమాను చూడండి అని చెప్పండి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం చెప్పారు. మొత్తానికి బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది.
Also Read: Pawan Kalyan on Reviews : రివ్యూలపై పవన్ రియాక్షన్… యుద్ధం చేయాల్సిందే అంటూ