BigTV English

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?
Advertisement

OG Movie Story Leak: మరికొన్ని రోజుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’ (OG Movie) థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, పాటలు, గ్లింప్స్‌ మూవీపై విపరీతమైన బజ్‌ పెంచాయి. నిజానికి ముందు నుంచి ఓజీపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలంగా ప్రకటనతోనే బజ్‌ క్రియేట్‌ చేసింది. సాహో ఫేం సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్‌, పాటలు మాత్రమే విడుదల కావడంతో మూవీ కథపై క్లారిటీ రావడం లేదు. ముంబైలో గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామా అని తెలుసు.


కానీ, కథ, కథనం ఏంటనేది పెద్దగా క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఓజీ కథేంటో తెలుసుకునేందుకు అభిమానులంత ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం హరి హర వీరమల్లు కథ. పీరియాడికల్‌ యాక్షన్‌గా వచ్చిన హరి హర వీరమల్లు రిలీజ్‌కి ముందు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్నారు. కానీ, రిలీజ్ తర్వాత ఈ సినిమా అంచనాలన్ని తారుమారు చేసింది. దీంతో ఓజీ విషయంలో ఈ ఫలితం రిపీట్‌ కావోద్దని అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓజీ స్టోరీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ అని, ఇందులో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని మువీ టీం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, ఎలా ఉంటుందనేది ఇప్పటికీ చెప్పలేదు.

ఓజీ స్టోరీ ఇదేనా


అప్‌డేట్‌లోనూ కథ రివీల్‌ అవ్వకుండ దర్శకుడి సుజీత్‌ జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో ఓజీ స్టోరీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దాని ప్రకారం.. ఈ సినిమా 1970 నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ముంబైలోని ఓ గ్యాంగస్టర్‌ కథ ఇది. ముంబైకి చెందిన పవర్ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ సాధారణ వ్యక్తిగా ఎలా మారాడు.. మళ్లీ అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి కారణాలు ఏంటీ? తిరిగి గ్యాంగ్‌స్టర్‌ మారిన అతడు శత్రువులను ఎలా ఓడించాడనేది ఓజీ కథ అని ముందు నుంచి ప్రచారం ఉంది. దీనికి ప్రకారం చూస్తే.. ఓజీ స్టోరీలో కొత్తదనం కనిపించడం లేదు. ఇలాంటి స్టోరీతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక్క తెలుగులోనే కాదు హిందీలోనూ ఇప్పటికే ఈ కథలు చూశాం. అమితాబ్‌ బచ్చన్‌ సర్కార్‌ మూవీ, ఆర్జీవీ ‘సత్య’, రజనీ ‘భాష’ చిత్రాలు ఇలాంటి స్టోరీతో తెరకెక్కాయి.

ఓజీకి కాపీ మరక..!

ఈ కథ వింటుంటే ఈ సినిమాలే గుర్తొచ్చాయి. ఇప్పటికే ఇలాంటివి చూసిన ఫ్యాన్స్‌.. ఓజీని ఆప్ట్‌ చేసుకుంటారా? అనేదే సమస్య. ప్రస్తుతం పాన్‌ ఇండియా క్రేజ్‌లో ఉన్న ఆడియన్స్‌ ఓజీ కథ మెప్పిస్తుందా? అని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. విభిన్న గ్యాంగ్‌స్టర్‌ స్టోరీ అయితే ఒకే.. కానీ, రోటీన్‌ కథ అయితే మాత్రం మళ్లీ ఫ్యాన్స్‌ని నిరాశ తప్పదేమో అంటున్నారు. కానీ, ఓ పక్క సుజీత్‌ మేకింగ్‌, టేకింగ్‌ స్టైల్‌ వేరు. రోటిన్‌ కథయినా.. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా కథను నడిపించగలడనే నమ్మకం ఉంది. ఓజీ.. రోటిన్ కథ అయినప్పటి తనదైన టేకింగ్‌, మేకింగ్‌తో మూవీని హిట్‌ చేస్తాడులే అని సినీ వర్గాలు నమ్ముతున్నాయి.

Also Read: OG Movie First Ticket : ఓజీ ఒక్క టికెట్ ధర రూ. 5 లక్షలు… పవన్ క్రేజ్ అంటే ఇది

ఒకవేళ.. ఈ అంచనాలు తప్పితే మాత్రం.. పవన్‌ ఖాతాలో మరో ప్లాప్‌ తప్పదేమో అనే భయం కూడా ఉంది. మరి ఓజీ విషయంలో సుజీత్‌ ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడనేది ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది. గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న హీరో.. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. అనుకోకుండ ఎదురైన ఓ సంఘటన వల్ల హీరోని సాధారణ వ్యక్తిగా మారుతుంది. భార్యకు కోసం మారిన గ్యాంగ్‌స్టర్‌.. తన పాత జీవితానికి దూరంగా ఉంటాడు. అలాంటి సమయంలో అతడి శత్రువులు.. తనని వెతుక్కుంటు వెళ్లి ఎటాక్‌ చేస్తారు. ఆ సంఘటనలో హీరోయిన్‌ మరణిస్తుంది. ఆ తర్వాత వారిపై పగ తీర్చుకునేందుకు హీరో మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఆ తర్వాత కథ ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

Related News

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Siddu Jonnalagadda: పాప్ కార్న్ అమ్ముకోవడానికి తెలుగులో ఈ పంచాయతీ, సిద్దు సంచలన వ్యాఖ్యలు

Big Stories

×