BigTV English

Samantha: అందులోనే నెగ్గాలని చూస్తున్న సామ్.. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Samantha: అందులోనే నెగ్గాలని చూస్తున్న సామ్.. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Samantha: సిటాడెల్ తరువాత సమంత నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. సినిమాలు ప్రకటిస్తుందే తప్ప.. షూటింగ్ చేస్తుందా లేదా అనే విషయం కూడా తెలియడం లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకపక్క మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ ఉంది. ఇంకోపక్క రక్త బ్రహ్మాండ ఉంది. వీటి గురించి ఒక్క అప్డేట్ లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సామ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా నిర్మాణ రంగంలోనే పెట్టిందనితెలుస్తోంది. నిర్మాతగా ఎదగడానికి కష్టపడుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


సమంత ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను మొదలుపెట్టి.. అందులో మొదటి సినిమాగా మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో.. నటిస్తుంది ఎవరో అనేది ఏమి చెప్పకుండా ప్రధాన పాత్రలో ఆమె ఉన్నట్లు ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే.. రెండో సినిమా శుభం అంటూ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఒక మోస్తరుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ, కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది.

శుభం తరువాత అయినా మా ఇంటి బంగారం ను మొదలుపెడుతుందేమో అనుకుంటే.. సామ్ దాన్ని పక్కనపెట్టి తన బ్యానర్ లో మూడో సినిమాను అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఒక కొత్త డైరెక్టర్ కథను వినిపించగా.. అది ఆమెకు బాగా నచ్చిందని, వెంటనే తన బ్యానర్ లో పట్టాలెక్కించాలని చూస్తున్నట్లు సమాచారం. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాను ఫినిష్ చేయాలనీ సామ్ చూస్తుందంట. డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.


నిర్మాతగా నెగ్గాలని సామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా.. అభిమానులు మాత్రం ఆమెను హీరోయిన్ గానే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సామ్ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. నిర్మాతగా మారే తరుణంలో సామ్ .. తన సినిమాలను మొత్తానికే వదిలేస్తుందా  అనే భయం పట్టుకుంది అభిమానుల్లో. ప్రస్తుతం తన మూడో కథ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడిందంట సామ్. ఇది ఓకే అయితే క్యాస్టింగ్ పనుల్లో బిజీగా మారుతుందని టాక్. త్వరలోనే ఈ సినిమాని  సామ్ అధికారికంగా ప్రకటించనుంది.

సినిమాల విషయం పక్కన పెడితే.. అనారోగ్య సమస్యల నుంచి సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో అమ్మడి ప్రేమాయణం  చాలా దూరమే వెళ్లినట్లు తెలుస్తోంది. ముంబైలో ఈ జంట ఒకే ఫ్లాట్ లో కలిసే ఉంటున్నారని సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని  అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.

Related News

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

HHVM 2: వీరమల్లు పార్ట్ 2లో క్రిష్ సీన్స్… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్!

Janhvi Kapoor: కొబ్బరి చెట్టు ఎక్కిన జాన్వీ, మలయాళీల ఆగ్రహం.. ఛీ ఇంత అవమానమా!

Big Stories

×