BSNL New Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పరిచయం చేసి రూ.1 ఫ్రీడమ్ ఆఫర్ కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. తొలుత ఆగష్టు 31 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించినా… వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించింది. అంటే, ఇప్పుడు ఈ ప్లాన్ సెప్టెంబర్ 15 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో, డేటా, అపరిమిత కాల్స్, SMS తో పాటు ఉచిత సిమ్ లభిస్తాయి. BSNL ఈ ప్లాన్ ధరను కేవలం రూ. 1గా ఫిక్స్ చేసింది.
15 రోజుల పొడిగింపు ఎందుకుంటే?
BSNL క్రేజీ ప్లాన్ పట్ల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో మరికొద్ది రోజులు ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే BSNL పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఈ ప్లాన్ ను ఉపయోగించుకోలేకపోయిన వినియోగదారులు ఈ 15 రోజులలో ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. .
BSNL ఫ్రీడమ్ ఆఫర్ ప్రయోజనాలు
ఈ ప్రత్యేక ఆఫర్ లో, BSNL తన కస్టమర్లకు చాలా అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలను ఉచితంగా పొందుతారు. దీనితో పాటు, కస్టమర్లకు ఉచిత BSNL ట్యూన్లు, రీఛార్జ్ బోనస్, MyBSNL యాప్, BSNL సెల్ఫ్ కేర్ పోర్టల్ నుంచి సులభమైన యాక్టివేషన్ ప్రయోజనం కూడా పొందవచ్చు.
BSNL ఫ్రీడమ్ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
BSNL యూజర్లు ఈ ప్రత్యేక ఆఫర్ ను వాడుకోవాలనుకుంటే.. ఈజీగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా MyBSNL యాప్, BSNL సెల్ఫ్ కేర్ పోర్టల్ లోకి లాగిన్ అయి, అక్కడ నుంచి ఫ్రీడమ్ ఆఫర్ ఎంపిక చేసుకోవాలి. దీని తర్వాత, రూ.1 మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ పూర్తయిన వెంటనే, మీ నంబర్ లో 2GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం వెంటనే యాక్టివేట్ అవుతుంది. అటు దీనితో పాటు, కస్టమర్లు కావాలనుకుంటే USSD కోడ్ ని ఉపయోగించి ఈ ఆఫర్ ను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం, మీ మొబైల్ నుంచి BSNL సూచించిన షార్ట్ కోడ్ ను డయల్ చేయాలి. ఆఫర్ వెంటనే ప్రారంభమవుతుంది.
₹1 Is All You Need! BSNL freedom offer gives you 2GB/Day, Unlimited Calling, 100 SMS/Day + Free SIM for 30 Days! Now Extended Till 15th September.
Experience pure #digital freedom with #BSNL.#BSNLOffer #BSNLSIM #DigitalFreedom #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/Ee3DDVzKRo
— BSNL India (@BSNLCorporate) September 1, 2025
30 రోజులు ఉచితం
ఫ్రీడమ్ ఆఫర్ 30 రోజులు పూర్తిగా ఉచితం. సిమ్ ను యాక్టివేట్ చేయడానికి రూ. 1 టోకెన్ ఫీజు చెల్లించాలి. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత, మీకు నచ్చిన ఏదైనా సాధారణ BSNL రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. నంబర్ ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం BSNL అదిరిపోయే ప్లాన్ ను మీరూ ఉపయోగించుకోండి.
Read Also: గంటకు రూ. 2.7 లక్షల అమ్మకాలు, ఏడాదికి రూ. 49 వేల కోట్ల ఆదాయం!