BigTV English

Pawan Klayan OG: ఓజీ వచ్చేది నేడే… పవన్ ముందన్న సవాళ్లు ఇవే

Pawan Klayan OG: ఓజీ వచ్చేది నేడే… పవన్ ముందన్న సవాళ్లు ఇవే


OG Movie First Day Target: పవర్స్టార్పవన్కళ్యాణ్పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్‌గా నటించిన ఓజీ మూవీ నేడు స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారా థియేటర్స్‌లోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ వల్ల ప్రీమియర్ షో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఆఫ్ లైన్‌లో కొన్ని చోట్ల టికెట్ ధర 3,000 నుంచి 4,000 వరకు ఉన్నా… అభిమానులు కొనేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి సినిమాపై ఎంత హైప్ ఉన్నదో. అయితే రిలీజ్‌కు ముందు పవన్ కళ్యాణ్ ముందు ఉన్న సవాళ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌కు గన్స్, గ్యాంగ్ స్టార్స్, కత్తి పట్టుకుని నరకే పాత్రలు అంటే చాలా ఇష్టం. అందుకే పొలిటికల్‌గా బిజీ షెడ్యూల్ ఉన్నా… ఓజీ మూవీని పూర్తి చేశాడు. పైగా డైరెక్టర్ సుజీత్‌ను ఈజీగా నమ్మొచ్చు.

సాహో ఎఫెక్ట్…

ఈయన డైరెక్ట్ చేసిన సాహో మూవీ రిజల్ట్ ఇప్పటికే అందరూ చూశారు. బాహుబలి లాంటి పెద్ద సినిమా తర్వాత సాహొ రావడం వల్లే అది నిరాశ పరిచిందని ఇప్పటికీ క్రిటిక్స్ అంటారు. అంతే తప్పా… ఆ సాహో మూవీలో సుజీత్‌ వర్క్ పై ఎవ్వరు కూడా తప్పులు ఎత్తి చూపలేదు. ఇప్పుడు కూడా ఓజీ మూవీకి అలాంటి పరిస్థితే ఉండొచ్చు. అయితే, ఇక్కడ సాహో లానే ఓజీ కూడా ఉండబోతుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఒకటి వినిపిస్తుంది. ఒక వేళ అది నిజమే అయితే.. సుజీత్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్‌పైనే పడుతుంది.


ప్రీమియర్స్ టికెట్స్ ప్రైజ్..

ఓజీ మూవీ ప్రీమియర్స్ షోల టికెట్స్‌ను చాలా మంది 2,000 రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొంటున్నారు. కొంత మంది అయితే 3,000 నుంచి 4,000 రూపాయలు పెట్టి కొంటున్నారు. అంత డబ్బు పెట్టి కొన్న తర్వాత అంతే అవుట్ పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అనుకున్న దాన్ని సినిమా మ్యాచ్ చేయకపోతే… పవన్ కళ్యాణ్‌కు సొంత అభిమానుల నుంచి నెగిటివ్ టాక్ రావొచ్చు.

పవన్ పాత్ర గంట మాత్రమే ?

సినిమాకు 2గంటల 34 నిమిషాల నిడివి ఉంది. ఓజీ కోసం ఆడియన్స్ వస్తున్నారంటే.. ఒకే ఒక్క కారణం అదే పవన్ కళ్యాణ్. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండేది కేవలం గంట మాత్రమే అని ఓ మాట వినిపిస్తుంది. అది నిజమే అయితే.. పవన్ కళ్యాణ్ కోసమే వచ్చే అభిమానులకు నిరాశే అని చెప్పొచ్చు. ఒకవేళ పవన్ పాత్ర గంట మాత్రమే ఉన్నా… ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా సాటిప్ఫై చేయాల్సి ఉంటుంది. అలా కాకపోయినా… మళ్లీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది.

Also Read: Akira Nandan in OG :  సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్

విలన్ డామినేషన్..

సాధారణంగా ఇమ్రాన్ హష్మి మంచి నటుడు. ఇప్పుడు ఓజీలో ఆయన విలన్ పాత్ర చేస్తున్నాడు. అలాగే ఫుల్ లెన్త్ ఉంటాడట. ట్రైలర్‌తో పాటు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు విడుదల చేసిన ఓ గ్లింప్స్‌లో కూడా ఇమ్రాన్ హష్మి స్క్రీన్ ప్రజెన్స్ బాగా ఉంది. కొంత మంది అయితే, పవన్ కళ్యాణ్‌ను డామినేట్ చేసేలా ఉంది అనే కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు సినిమాలో కూడా అలానే ఉంటే పవన్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరిగినా.. సినిమాపై ఎఫెక్ట్ తప్పదు.

ఓపెనింగ్ డే కలెక్షన్లు…

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల టార్గెట్ రూ. 100 కోట్ల వరకు పెట్టుకున్నారు. అభిమానులు కూడా రూ. 100 కోట్లు ఫస్ట్ డే పక్కా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రీమియర్స్ వల్ల ఈ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది నిజమే అయితే.. ఫస్ట్ డే రూ. 100 కోట్లు రావడం పెద్ద విషయమేమీ కాదు. ఒక వేళ రూ. 100 కోట్ల మార్క్ ను ఫస్ట్ డే అందుకోకపోతే మాత్రం మెగా యాంటీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ట్రోల్స్ ఎదుర్కొక తప్పదు.

Related News

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

OG Bookings : ఓజీ కోసం మరో మూవీ త్యాగం… థియేటర్స్ అన్నీ ఇచ్చేశారు

Reba Monica: రజనీకాంత్ తో సినిమా.. నిరాశ మాత్రమే మిగిలిందన్న నటి..ఏమైందంటే?

OG Premiere Show : ఓజీ టైం… గుంటూరు కారం గుర్తొస్తుంది గురు

Akira Nandan in OG: సర్‌ప్రైజ్.. ఓజీ మూవీలో అకీరా నందన్… ఓపెన్‌గా చెప్పేసిన థమన్

OG Tickets : పీవీఆర్ థియేటర్ యాజమాన్యంతో పవన్ ఫ్యాన్స్ గొడవ.. అసలు ఏమైంది?

Big Stories

×