OG Premiere Show : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఓజీ మూవీ మరి కొన్ని గంటల్లోనే ప్రీమియర్స్ షో ద్వారా… థియేటర్స్‌లోకి రాబోతుంది. ప్రీమియర్స్ టికెట్స్ బ్లాక్‌లో 4000 రూపాయలు ఉన్నా… అభిమానులు కొనేస్తున్నారు. 4000 వేల రూపాయలు ఒక్క సినిమాపై పెడుతున్నారంటే… ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో… పవన్ కళ్యాణ్ అంటే వాళ్లకు ఎంత పిచ్చో అర్థమైతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే భయం కూడా అవుతుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా గుర్తుకు వస్తుంది. గుంటూరు కారం మూవీ టైంలో ఏం జరిగింది ? ఆ సినిమా ఇప్పుడు ఓజీ టైంలో ఎందుకు గుర్తు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. గతేడాది సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ అయింది. హనుమాన్ చిన్న సినిమా పోటీగా రావడంతో కొంత వరకు ఈ సినిమాకు దెబ్బ పడింది. దానితో పాటు ఈ సినిమాకు మరో మైనస్ కూడా ఉంది.
గుంటూరు కారం సినిమాకు కూడా అప్పట్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రీమియర్స్ షోలకు అనుమతులు ఇచ్చాయి. దీంతో గుంటూరు కారం మూవీ ప్రీమియర్స్ అర్థరాత్రి 1 గంటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ వరకు మిక్సిడ్ టాక్.. కొన్ని ఏరియాల్లో నుంచి నెగిటివ్ టాక్ ఆ సినిమాకు వచ్చింది.
అది తర్వాత షోలపై భారీ ఎఫెక్ట్ చూపించింది. అదే టైంలో… హనుమాన్ సినిమా రావడంతో త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే క్యూ కట్టే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ… హనుమాన్ మూవీ వైపు వెళ్లారు. దీనికి కారణం… మహేష్ బాబు ఫ్యాన్స్. దీన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత నాగ వంశీనే చెప్పాడు.
అర్థరాత్రి, చలికాలం ఒక్కో టికెట్‌ను అభిమానులు 3000 నుంచి 5000 రూపాయలు పెట్టి కొన్నారని, ఓవర్ హైప్ క్రియేట్ చేసుకున్నారని అన్నాడు. కానీ, అభిమానులు అంచనా వేసినట్టు సినిమా లేకపోవడంతో… ఫ్యాన్స్ నుంచే నెగిటివ్ టాక్ వచ్చిందంటూ నిర్మాత నాగ వంశీ అన్నాడు. నిజానికి అదే జరిగింది. ఓవర్ హైప్ వల్ల ఫ్యాన్సే ఆ సినిమాకు కిల్ చేశారు.
ఇప్పుడు ఓజీ మూవీకి కూడా అదే రిపీట్ అవుతుందా..? అంటే ఆ ఛాన్స్ లు ఉండే అవకాశం ఉంది అని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. 800 రూపాయల టికెట్‌ను బయట 4000 రూపాయలకు అమ్మడం వల్ల అభిమానులు ఇప్పటికే మండిపడుతున్నారు. అదే కోపంతో థియేటర్‌కి వెళ్లిన తర్వాత అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు సినిమా లేకపోతే… పక్కా ఫ్యాన్సే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే అవకాశం లేకపోలేదు. పైగా ఈ సినిమాకు కూడా ఓవర్ హైప్ ఉంది.
చూడాలి మరి… అభిమానులపై హైప్‌ను ఓజీ మ్యాచ్ చేస్తుందా..? వాళ్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ను పవన్ కళ్యాణ్ రీచ్ అవుతాడా ? ప్రభాస్ అభిమానులను హర్ట్ చేసిన సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను అభిమానులను సాటిస్ఫై చేస్తాడా ? ఈ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.