Reba Monica John: రెబా మోనిక జాన్(Reba Monica John) ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కూలీ (Coolie) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె శృతిహాసన్ చెల్లెలి పాత్రలో నటించి సందడి చేశారు. అయితే ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ కూలీ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా తీవ్రస్థాయిలో విమర్శలకు కూడా కారణమవుతున్నాయి. మరి ఈమె పై ఇలాంటి విమర్శలు రావడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే…
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో రజినీకాంత్ రచితా రామ్, శృతిహాసన్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం కూలీ. ఈ సినిమాలో శృతిహాసన్, రెబా మోనికా సిస్టర్స్ గా కనిపించి సందడి చేశారు. అయితే తాజాగా ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ తాను రజనీకాంత్ సినిమాలో నటించినప్పటికీ నాకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని, ఈ సినిమాకు ఎంతవరకు చేయగలనో అంతవరకు నటించాను కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఈ సినిమా ద్వారా నిరుత్సాహమే మిగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కానీ రజనీకాంత్ గారి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకు వచ్చారు.
విమర్శలకు గురి అవుతున్న మోనిక..
ఇలా రజినీకాంత్ సినిమాలో చేసిన తనుకు నిరుత్సాహం మాత్రమే మిగిలిందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మోనికా మాట్లాడుతూ ఈ సినిమాలో ఈ పాత్ర కోసం తానే డైరెక్టర్ ని సంప్రదించానని అయితే ఈ పాత్ర గురించి ముందుగా దర్శకుడు తనతో చెప్పారని వెల్లడించారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలను ఈమెకు ట్యాగ్ చేస్తూ ఇలా సినిమా విడుదలకు ముందు ఒక మాట, విడుదల తర్వాత మరొక మాట మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో కూలీ…
ఇక కూలీ సినిమా విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్య రాజ్ వంటి సెలబ్రిటీలు భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో మొదటిసారి నాగార్జున సైమన్ అనే విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ఆకట్టుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
Also Read: Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్